విధాత : హీరో అక్కినేని నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలో మంగళవారం తుది శ్వాస విడిచారు. అక్కినేని నాగేశ్వర్‌రావుకు సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్, నాగార్జునలు ఐదుగురు సంతానం. సత్యవతి చాల ఏళ్ల క్రితమే మరణించారు. సరోజ స్టార్ హీరోల కుటుంబానికి చెందిన వారైనప్పటికి ఆమె సాధారణ జీవితం గడిపేవారు. నాగ సరోజ మృతితో అక్కినేని ఇంట విషాదం నెలకొంది.