Nalgonda |
విధాత: లారీ ఢీ కొట్టిన రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆమె ఏడాది వయసు పసిపాప ప్రమాదం నుండి క్షేమంగా బయటపడింది. నల్గొండ నుండి వెళుతున్న లారీ నార్కట్ పల్లి మండలం యల్లారెడ్డి గూడెం గ్రామం అద్దంకి- నార్కట్ పల్లి హైవే పై గురుకుల పాఠశాల సమీపంలో కి రాగానే రోడ్డు దాటుతున్న మహిళ ను ఢీ కొట్టేంది.
ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందగా తన చేతుల్లోని ఏడాది వయసు గల పాలు త్రాగే పసి పాప కు చిన్న గాయాలయ్యాయి. నల్గొండ ప్రభుత్వాసుపత్రి లో పాపకు చికిత్స అందిస్తున్నారు.
చనిపోయిన తల్లి చేతిపై అమ్మ అనే పచ్చ బొట్టు వుండగా, ఆమె వయస్సు సుమారు 30 సంవత్సరాలుగా భావిస్తున్నారు. మెడ పై పచ్చని దారపు పుస్తెల త్రాడు ఉందని, వివరాలు తెలిసిన వారు నార్కట్ పల్లి ఎస్ ఐ నంబర్ 8712670186కు, లేదా సీఐ నంబర్ 8712670148 కు కానీ సంప్రదించగలరని పోలీసులు తెలిపారు.