Site icon vidhaatha

TSPSC Paper Leakage: రేణుక బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

విధాత‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు నిందితురాలు రేణుక బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఆమె ఏ-3 నిందితురాలిగా ఉన్నారు. తనకు అనారోగ్యంగా ఉందని, పిల్లల బాగోగులు చూసుకునే వారు ఎవరూ లేరని రేణుక పిటిషన్‌లో పేర్కొన్నారు.

పేపర్‌ లీకేజీతో తనకు ప్రత్యక్ష ప్రమేయం లేదని, నేరాభియోగాలు మాత్రమే చేశారని కోర్టు దృష్టికి తెచ్చింది. కేసు విచారణ దశలో ఉన్నందున రేణుకకు బెయిల్‌ ఇవ్వొద్దని సిట్‌ తరఫున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్‌ ఇస్తే విచారణపై ప్రభావం చూపుతుందని తెలిపారు.

దీంతో ఆమె పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. మరో ముగ్గురు నిందితులు ప్రశాంత్‌, రాజేందర్‌, తిరుపతయ్యలను సిట్‌ అధికారులు వారం రోజుల పాటు కస్టడీకి కోరారు. ఈ కేసులో వారిని ఇటీవలే అరెస్టు చేశారు. కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. దీనిపై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు ప్రకటించనున్నది.

Exit mobile version