Site icon vidhaatha

New Parliament Building | మోదీ వన్‌ మ్యాన్‌ షో! అట్టహాసంగా నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం..

New Parliament Building |

విధాత: భారత పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ప్రతిపక్షాల డిమాండ్‌ను కనీసం పరిగణనలోకి తీసుకోని బీజేపీ సర్కారు.. దేశ ప్రధమ పౌరురాలు.. త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిలువకుండానే కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి నిరసనగా దాదాపు 20 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.

రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌కు పిలుపు రాలేదు. ప్రారంభోత్సవ ఘట్టాలన్నింటిలోనూ మోదీ తరహా వన్‌ మ్యాన్‌ షో స్పష్టంగా కనిపించింది. ఫొటోలకు పోజులు ఇస్తూ ఆయన పార్లమెంటు ప్రాంగణంలో నడయాడారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా మోదీ ఫొటోలకు అడ్డు రాకూడదన్నట్టు.. దూరంగా ఉండి నడిచారు.

నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించిన‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, స్పీక‌ర్ ఓం బిర్లాలు.. అక్క‌డ నిర్వ‌హించిన పూజ‌, యజ్ఞాల్లో పాల్గొన్నారు. అనంత‌రం శ‌నివారం మ‌ఠాధిప‌తుల నుంచి స్వీక‌రించిన ధ‌ర్మ‌దండాన్ని (సెంగోల్‌) స్పీక‌ర్ స్థానం వ‌ద్ద మోదీ ప్ర‌తిష్ఠించారు. బ్రిటిష్‌ వైస్రాయ్‌ మౌంట్‌ బాటెన్‌ నుంచి అధికారి మార్పిడికి సూచికగా ఈ సెంగోల్‌ను నెహ్రూ అందుకున్నారని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నా.. అందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడం వివాదానికి దారి తీసింది.

ఈ ప్ర‌క్రియ‌తో తొలి ద‌శ‌ వేడుక ముగిసింది. రెండో భాగం మ‌ధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఇత‌ర అతిథులు లోక్‌స‌భ‌లో కొలువుదీరిన త‌ర్వాత జాతీయ‌గీతాలాప‌న‌తో కార్య‌క్ర‌మం మొద‌లవుతుంది. ఈ కార్య‌క్ర‌మంపై ప‌లువురు స్పందించారు. ఇది గ‌ర్వ‌ప‌డాల్సిన స‌మ‌య‌మ‌ని బ‌యోకాన్ లిమిటెడ్ ఛైర్‌పర్స‌న్ కిర‌ణ్ మ‌జుందార్ షా వ్యాఖ్యానించ‌గా.. ప్ర‌తిప‌క్షాలు హాజ‌రు కాని ఈ వేడుక అర్థం లేనిద‌ని ఎన్సీపీ నేత‌, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు.

మ‌రోవైపు నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నానికి ఆదివారం నిర‌స‌న ర్యాలీ చేప‌డ‌తామ‌ని ఖాప్ పంచాయ‌తీ నాయ‌కులు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం దాదాపు పదివేల మంది భద్రతాసిబ్బందిని మోహరించారు.

పోలీసులు, కేంద్ర బ‌ల‌గాలు ప‌లు చోట్ల మార్చింగ్ నిర్వహించాయి. తన పేరు తప్ప ద్రౌపది ముర్ము లేదా జగదీప్‌ ధన్‌కర్‌ పేర్లు పార్లమెంటు నూతన భవన శిలాఫలకంపై ఉండకూడదన్న ఉద్దేశంతోనే వారిని పిలవలేదని కాంగ్రెస్‌ మండిపడింది. మోదీ వన్‌ మ్యాన్‌ షో చేశారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Exit mobile version