Site icon vidhaatha

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: దీక్షిత్

విధాత‌: టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై అణ‌చివేత ధోర‌ణి కొనసాగుతుందని అక్రమ అరెస్టులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరని ఆ పార్టీ యువమోర్చా నాయకుడు జిల్లా ఇన్‌చార్జి బండి దీక్షిత్ అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

టౌన్ ప్లానింగ్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని విమర్శించారు. 8 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్లు వేస్తూ పరీక్షల సమయంలో పత్రికల లీకేజీలతో అనేకమంది నిరుద్యోగ యువతీ యువకులు తీవ్ర నష్టపోతున్నారని వాపోయారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగ యువకులకు అండగా నిలుస్తూ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్‌ని వెంటనే విడుదల చేయాలని వారిపై పెట్టిన కేసులను బేష‌రతుగా కొట్టివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దుర్గాప్రసాద్, నవీన్ రెడ్డి, ప్రవీణ్, కే. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version