Site icon vidhaatha

NTR 30 : అయ్యబాబోయ్.. ఈ విలన్‌ రెమ్యూనరేషన్‌తో ఓ మోస్తరు సినిమా తీయొచ్చు!

NTR 30

విధాత: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘NTR 30’ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన విషయం తెలిసిందే. అంతకు ముందు అప్‌డేట్స్ కోసం అల్లాడిపోయిన అభిమానులను ఇప్పుడు మేకర్స్ వరుస అప్‌డేట్‌లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఒక్కో టెక్నీషియన్‌ని పరిచయం చేస్తుంటే.. ఓ హాలీవుడ్ రేంజ్ సినిమా ముందే చూపిస్తున్న భావన అభిమానులలో కలుగుతుంది.

ఇక ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ఊహించని విధంగా.. ఈ ప్రాజెక్ట్‌‌కి జాన్వీ కపూర్‌ని సెట్ చేశారు. ముందు ఆలియా భట్ అనుకున్న ఈ ప్రాజెక్ట్‌లోకి.. ఫైనల్‌గా జాన్వీ వచ్చి చేరింది. ఆమెకు దాదాపు రూ. 3 కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ని మేకర్స్ ఇవ్వబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లోకి మరో బాలీవుడ్ స్టార్ నటుడు యాడ్ అయ్యారు. ఇక ఆయన రెమ్యూనరేషన్‌ గురించి వినిపిస్తున్న వార్త వింటే అంతా షాకవుతారు కూడా.

ఈ సినిమాలో ముందు ఇప్పుడనుకుంటున్న బాలీవుడ్ నటుడు చేయనని చెప్పినట్టుగా ఇటీవల వార్తలు వినిపించాయి. మరి దీనిని ప్రెస్టీజీయస్‌గా తీసుకున్నారో.. ఏమో గానీ.. ఆ నటుడిని ఈ సినిమాలో ఒప్పించేందుకు భారీ మొత్తమే ఖర్చు పెడుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇటీవల ఐపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని విధంగా శామ్ కర్రన్ అమ్ముడైనట్లుగా.. ఇప్పుడు NTR 30 సినిమా కోసం సైఫ్ అలీఖాన్‌‌కు భారీ మొత్తం ఇచ్చి మేకర్స్ కొనేశారు. ఈ సినిమాలో విలన్‌గా నటించినందుకు సైఫ్ అలీ ఖాన్‌కు రూ. 15 కోట్ల క్యాష్, అదనంగా జీఎస్టీ అమౌంట్‌ని పే చేసేందుకు మేకర్స్ డీల్ కుదుర్చుకున్నారట. ఈ విషయం తెలిసి నిజంగానే అంతా షాక్ అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో పరాయి భాషల నుంచి వచ్చిన నటులకు అంత అమౌంట్ ఎవరూ ఇచ్చిన ధాఖలాలు లేవు. ‘సైరా’లో నటించిన అమితాబ్‌కు, ‘గాడ్‌ఫాదర్’లో నటించిన సల్మాన్ ఖాన్‌లకు కూడా అంత మొత్తం అందలేదు. సల్మాన్ అయితే ఫ్రీగా చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

కానీ ఆయా చిత్రాల మేకర్స్ వారికి ఏవో గిఫ్ట్‌లు పంపినట్లుగా ఆ తర్వాత టాక్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా సైఫ్‌కు అంత మొత్తం వెచ్చించడంతో.. ఇటీవల తమ్మారెడ్డి ఆస్కార్ క్యాంపెయిన్‌పై చేసిన కామెంట్స్‌లా.. ఓ మోస్తరు హీరోతో సినిమా చేసేంత బడ్జెట్ సైఫ్ రెమ్యూనరేషన్‌కే ఇస్తున్నారనేలా.. ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అది విషయం.

Exit mobile version