Site icon vidhaatha

Kodad | బొల్లంకు సొంత పార్టీ నేతల మరో జలక్‌.. హైద్రాబాద్‌కు అసమ్మతి నేతలు

Kodad |

విధాత : కోదాడ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు మరోసారి టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలు మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్‌రావు, నియోజకవర్గ ఇంచార్జి కన్మంత్‌రెడ్డి శశిధర్‌రెడ్డి, యేర్నెని వెంకటరత్నం బాబులు తమ అనుచరులతో కలిసి శుక్రవారం హైద్రాబాద్‌కు చేరుకున్నారు.

నిన్న చందర్‌రావుతో సయోధ్య కోసం వెళ్లిన బొల్లంకు ఆయన ఇంట్లో ఉండి కూడా కలవడానికి నిరాకరించడంతో బొల్లం నిరాశగా వెనుతిరిగారు. ఈరోజు శుక్రవారం కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి ఇంటికి బొల్లం వస్తున్నారని తెలిసి ఆయన ఇంట్లో ఉండకుండా అసమ్మతి వాదులందరితో కలిసి హైద్రాబాద్‌కు వెళ్లిపోయారు.

బొల్లం టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం తధ్యమని వెంటనే ఆయనకు టికెట్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తు అసమ్మతివాదులంతా బీఆరెస్ అధిష్టానాన్ని కలిసి కోరనున్నట్లుగా సమాచారం. తన వ్యతిరేక వర్గీయులు బుజ్జగింపులకు ససేమిరా అంటుండటంతో బొల్లంలో టెన్షన్ పెరిగిపోతుండగా, సర్ధుబాటుకు జోక్యం చేసుకోవాలని ఆయన అధిష్టానాన్ని ఆశ్రయించనున్నట్లుగా తెలుస్తుంది.

Exit mobile version