విధాత: పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటూ ఒంటరివాడ య్యారు. కనీసం తన సొంత దేశం నుంచి అయినా మద్ధతు లభిస్తుందని ఆశించినా అక్కడా నిరాశే ఎదురైంది. దీంతో తీవ్ర అసహనానికి గురైన బిలావల్ తానొక గాడిదనయ్యానని వాపోతున్నారు.
భారత ప్రదాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తప్పుపట్టింది. ఇదిలా ఉంటే స్వదేశం నుంచైనా మద్దతు ఉంటుందని ఆశించారు. కానీ అక్కడా స్వదేశీయుల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో.. తాను గాడిదనయ్యానని బిలావల్ అంటున్నారు.
పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న స్థితిలో.. తాను విదేశీ ప్రయాణాలు సొంత ఖర్చుతో వెళ్తున్నానని, విదేశాంగ శాఖకు గాడిద చాకిరి చేస్తున్నానని అన్నారు. అయినా తనకు విదేశాంగ శాఖ, పాక్ ప్రజల నుంచి సాయం, మద్దతు లభించటం లేదంటున్నారు. ఇంకా తానేమీ చేయగలనని ప్రశ్నిస్తున్నారు.