PM Modi: : ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో సిందూర్ మొక్కను నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఈ ఫోటోలను షేర్ చేశారు. 1971 యుద్ధంలో వీరోచితంగా పోరాడిన గుజరాత్ లోని కచ్ మహిళలు ఇచ్చిన సిందూర్ మొక్కను పర్యావరణ దినోత్సవం రోజున నాటినట్లుగా తెలిపారు. తన గుజరాత్ పర్యటన సందర్భంగా ఒక సింధూర మొక్కను శౌర్యానికి, ధైర్యానికి నిదర్శనంగా నిలిచిన తల్లులు నాకు బహూకరించారు..నేడు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో ఆ మొక్కను నాటిన భాగ్యం నాకు కలిగిందని మోదీ తెలిపారు. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి యొక్క శౌర్యం, ప్రేరణకు బలమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు. అనంతరం ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో మొక్కను నాటినట్లుగా మోదీ ట్వీట్ చేశారు. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆరావళి శ్రేణిలో అడవులను పెంచే మా ప్రయత్నంలో ఇది కూడా ఒక భాగమని మోదీ తెలిపారు.
PM Modi: సిందూర్ మొక్కను నాటిన ప్రధాని మోదీ
PM Modi: : ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో సిందూర్ మొక్కను నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఈ ఫోటోలను షేర్ చేశారు. 1971 యుద్ధంలో వీరోచితంగా పోరాడిన గుజరాత్ లోని కచ్ మహిళలు ఇచ్చిన సిందూర్ మొక్కను పర్యావరణ దినోత్సవం రోజున నాటినట్లుగా తెలిపారు. తన గుజరాత్ పర్యటన సందర్భంగా ఒక సింధూర మొక్కను శౌర్యానికి, ధైర్యానికి నిదర్శనంగా నిలిచిన […]

Latest News
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!
ఎడారి పాము ఎత్తులు ఎన్నో..క్షణాల్లో ఇసుకలోకి!