Site icon vidhaatha

BJP | MP అరవింద్‌కు నిరసన సెగ.. కార్యాలయం ఎదుట సొంత పార్టీ కార్యకర్తల బైఠాయింపు

BJP |

విధాత:ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. ఎంపీ అరవింద్‌కు వ్యతిరేకంగా ఆర్మూర్, బోధన్, బాల్కొండకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా పార్టీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

ఎంపీ అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, ఎంపీ అరవింద్ తీరుపై మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా లోని 13 మండలాలకు చెందిన మండల నాయకులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇటీవల మండల కమిటీలు ఏర్పాటు చేసి, పాత వారికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ అరవింద్ కు జై కొట్టిన వారికే పదవులు ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పార్టీ నాయకులు స్పందించి, పాత వారికే ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ అని, కానీ ఎంపీ అరవింద్, ఏకపక్ష నిర్ణయాలతోఒంటెద్దు పోకడ గా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Exit mobile version