విధాత: పూరి జగన్నాథ్.. నిస్సందేహంగా ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం, ఆయనకు వచ్చే ఐడియాలు, ఆలోచించే విధానం.. ఇలా ప్రతీది సమ్‌థింగ్ స్పెషల్‌గా, యూనిక్‌గా ఉంటాయి. నలుగురు నడిచిన దారిలో సుఖం, విజయం ఉన్నా ఆయన ఆ జోలికి పోరు. తనదైన బాటలోనే ముళ్లబాట అయినా సరే నడుస్తానంటారు.
తన సినిమాలతో జీవితాన్ని, జీవిత పాఠాల్ని చూపిస్తూనే మనోడు అనిపించుకున్నాడు. ఆయన తనదైన శైలిలో జీవిత సత్యాలను ఒకే వాక్యంలో చెప్పడం ఆయన సినిమాలలో చూడవచ్చు, వినవచ్చు. వాటిని ఆస్వాదించవచ్చు. ఇతరుల మీద ప్రయోగించవచ్చు. తేనె ముల్లులా సమ్మగా దిగిన ఎఫెక్ట్, ఇంపాక్ట్ చాలా ఎక్కువగా దీర్ఘకాలం మనల్ని వెంటాడుతూనే ఉంటాయని ఆయన స్టైల్‌లోనే చెప్పొచ్చు.
అచ్చంగా ఆ కాన్సెఫ్ట్‌ని పూరి మూజింగ్స్ పేరుతో పాడ్‌కాస్ట్‌లు, వీడియోలు చేస్తున్నాడు. ఇటీవలే తడ్కా గురించి వివరించిన ఆయన తాజాగా మిర్రరింగ్ గురించి చెప్పుకొచ్చాడు. వినడానికి కొత్తగా ఉన్నా ఈ మిర్రరింగ్ అనేది మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఎంత తెలిసిన విషయమైనా అది పూరీ నోట వింటే ఆ కిక్కే వేరు.
ఇక విషయానికొస్తే మిర్రరింగ్ అంటే కొందరు మనతో స్నేహం చేస్తూ, మనలాగే ప్రవర్తిస్తూ, అచ్చం నువ్వు నేను ఒకటే అన్నా.. అంటూ మనల్ని మోసం చేస్తారు. మన పెద్దలు చెప్పినట్టు ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు…. వీరు వారవుతారు. సింపుల్‌గా దీన్నే ఇంగ్లీషులో మిర్రరింగ్ అంటారు.
మనకు నచ్చిన మనిషిని పదే పదే పరిశీలించడంతో మనకు తెలియకుండానే వాళ్ల లక్షణాలు మనకు వస్తాయి. అక్కడినుండి మనము వాళ్లలాగే ప్రవర్తిస్తాం. మొదట్లో కాస్త అలా ప్రవర్తిస్తున్నామని తెలిసినా.. ఆ తర్వాత మన ప్రవర్తన అంతే అనుకుంటాం. ఎదుటివారి హావభావాలు కాపీ కొడుతుంటాం. మాటకు మాటకు వాళ్లు ఇచ్చే గ్యాప్ లాంటివి మనము తెలియకుండా అనుకరించేస్తుంటాం.
మరికొందరు ఉన్నారు సుమా.. వాళ్లు పక్కవారి మైండ్ కూడా కాపీ కొడతారు. అచ్చు వాళ్ల లాగానే ఆలోచించాలని ప్రయత్నిస్తారు. ఆఖరికి ఆహారం కూడా అలాగే తింటూ ఉంటారు. మిర్రరింగ్ ఇంపాక్ట్ వల్ల చివరకు మన బాడీ లాంగ్వేజ్‌తో పాటు డ్రెస్సింగ్ సెన్స్ కూడా మారుతుంది. ఆలోచన విధానం కూడా మారవచ్చు.
ఈ మిర్రరింగ్‌లో మంచి ఫ్రెండ్స్ ఉంటారు.. శత్రువులు కూడా ఉంటారు. కొందరు వ్యక్తులైతే మన పక్కనే ఉండి మనల్ని కాపీ కొడుతూ నువ్వు నేను ఒకటే అన్నా అనే ఫీలింగ్ కలిగించి మనల్ని మోసం చేస్తారు. మీ పార్టనర్‌లోని బాడీపెయిన్స్ మీకు షిఫ్ట్ అవుతాయి. ఈ మిర్రరింగ్ వల్ల ఓ ఇద్దరి మధ్య స్నేహం బలపడుతుంది.
ఇక బాడీ లాంగ్వేజ్‌లు, ఫుడ్ కల్చర్ మారుతాయి. అన్ని ఎదుటి వారిలాగే.. దీనివల్ల ఇద్దరి మధ్య స్నేహం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మిర్రరింగ్ ఎక్కువగా సీనియర్స్ జూనియర్స్ మధ్య, కపుల్స్ మధ్య, ప్రతిభావంతులైన వారికి మనకి మధ్య జరుగుతుంది. మిర్రరింగ్ వల్ల పాజిటివ్ లక్షణాలు వస్తే పర్లేదు.. నెగిటివ్ క్వాలిటీస్ రాకుండా మాత్రం జాగ్రత్త పడాలి సుమా.. అని చెప్పుకొచ్చాడు.
Mirroring is all about Mimicking.
Now Listen to #Mirroring