Site icon vidhaatha

బుల్లెట్‌పై దూసుకెళ్లిన రాహుల్ గాంధీ.. వీడియో

Rahul Gandhi |విధాత: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర జోరుగా కొన‌సాగుతోంది. ఈ యాత్ర‌లో వేలాది మంది కార్య‌క‌ర్త‌లు పాల్గొని రాహుల్‌లో జోష్‌ నింపుతున్నారు. రాహుల్ కూడా ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొన‌సాగుతోన్న భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్ గాంధీ అంద‌రికి షాకిచ్చారు.

బ్లూ కార్పెట్‌పై బుల్లెట్ బండి న‌డిపి కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌లు ఈల‌లు వేసి రాహుల్ గాంధీలో మ‌రింత జోష్ నింపారు. తెలంగాణ‌లో యాత్ర కొన‌సాగిన స‌మ‌యంలో రాహుల్, రేవంత్ క‌లిసి జాతీయ ర‌హ‌దారి 44పై ప‌రుగు పందెంలో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ పందెంలో రాహులే గెలిచారు.

రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌ను ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడు లోని క‌న్యాకుమారి నుంచి ఈ యాత్ర మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు 3,500 కిలోమీట‌ర్ల రాహుల్ యాత్ర కొన‌సాగింది. భార‌త్ జోడో యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తుంది.

Exit mobile version