Site icon vidhaatha

Kiren Rijiju | రాహుల్‌ గాంధీ దేశానికి ప్రమాదకరం..! కాంగ్రెస్‌ నేతపై మండిపడ్డ కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు

Kiren Rijiju | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ట్వీట్‌ చేసిన కేంద్రమంత్రి.. రాహుల్‌ గాంధీని దేశ సమైక్యతకు అతిపెద్ద ముప్పుగా అభివర్ణించారు.

‘పప్పు’ అంటూ విమర్శించారు. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని ఇందిరా గాంధీని ఉదాహరణగా చూపుతూ రాహుల్‌కు చురకలకంటించారు. ‘మీ అమ్మమ్మ ఇందిరా గాంధీ నన్ను ఎప్పుడూ ఆశీర్వదించారు. ఆమె నాకు అక్క లాంటిది. ఆమె ఒక అద్భుతమైన మహిళ. ఆమె ఒకసారి లండన్‌కి వచ్చింది.

ఇక్కడ విలేకరుల సమావేశంలో.. మొరార్జీ దేశాయ్ గురించి ఒక ప్రశ్న అడిగారు. అతని అనుభవం ఏమిటి? ప్రశ్నిస్తే.. భారత అంతర్గత వ్యవహారాల గురించి నేను (ఇందిరాగాంధీ) ఇక్కడ మాట్లాడదలచుకోలేదని ఆమె స్పష్టంగా చెప్పారు. కానీ, మీరు (రాహుల్‌) భారత్‌పై నిరంతరం దాడి చేస్తున్నారు. ఇక్కడ మీ అమ్మమ్మ చెప్పిన దాని నుంచి మీరు కొంత నేర్చుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

ఎందుకంటే నేను మీ శ్రేయోభిలాషిని, మిమ్మల్ని ప్రధానిగా చూడాలనుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. వీడియోను షేర్‌ చేస్తూ.. ‘రాహుల్ గాంధీ జీ మన మాట వినడు, కానీ అతను తన అంకితభావంతో శ్రేయోభిలాషుల మాట వింటాడని నేను ఆశిస్తున్నాను!’ అంటూ కిరణ్‌ రిజిజు ట్వీట్‌ చేశారు.

రాహుల్‌ గాంధీ ఆక్స్‌ఫర్డ్‌లో చేసిన ప్రసంగం వీడియోను షేర్‌ చేశారు కిరణ్‌ రిజిజు. ‘ఈ స్వయం ప్రకటిత కాంగ్రెస్ యువరాజు అన్ని పరిమితులను దాటారు. ఈ వ్యక్తి భారతదేశ ఐక్యతకు అత్యంత ప్రమాదకరంగా మారాడు. ఇప్పుడు భారతదేశాన్ని విభజించాలని ప్రజలను ఉసిగొల్పుతున్నాడు.

భారతదేశ అత్యంత ప్రజాదరణ, ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ అనే ఒకే ఒక మంత్రం ఉంది. రాహుల్ గాంధీ పప్పు అని భారత ప్రజలకు తెలుసు.. కానీ. ఆయన అసలు పప్పు అని విదేశీయులకు తెలియదు. అతని వెర్రి ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. కానీ, సమస్య ఏమిటంటే.. ఆయన భారత వ్యతిరేక ప్రకటనలను భారతదేశ వ్యతిరేక శక్తులు.. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు దుర్వినియోగమవుతాయి’ అంటూ విమర్శించారు.

Exit mobile version