Site icon vidhaatha

Rahul Disqualified: ఈ రోజు అధికారిక బంగళా.. ఖాళీ చేయ‌నున్న రాహుల్ గాంధీ

విధాత: గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోర్టు ఆదేశం ప్రకారం అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.

ఉత్తరప్రదేశ్ అమేథి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన తరువాత రాహుల్ గాంధీకి 2005 సంవత్సరంలో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని 12వ నెంబర్ అధికారిక బంగళాను కేటాయించారు.

ఎంపిగా అనర్హత వేటుకు గురైనందున ఏప్రిల్ 22వ తేదీ లోపు బంగళాను ఖాళీ చేయాలని లోక్‌సభ సచివాలయం రాహుల్‌కు నోటీసులు పంపించింది.

నోటీసుల ప్రకారం ఇవాళ రాహుల్ అధికారిక బంగళాను ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. ట్రక్కుల ద్వారా సామాన్లు, ఫర్నీఛర్ ను తరలించారు.

Exit mobile version