తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14వార్డులు ఏకగ్రీవం !

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగగా మహిళా అభ్యర్థులు మెజార్టీగా ఎన్నికయ్యారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల్లో పలు మున్సిపాల్టీలు, కార్పోరేషన్ల వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116మున్సిపాల్టీలు, 7 కార్పోరేషన్ల పరిధిలోని 2,996వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 14 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాటిలో మెజార్టీ వార్డులు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులు 12 చోట్ల ఏకగ్రీవం కాగా.. బీఆర్‌ఎస్‌ నుంచి రెండు వార్డుల్లో ఏకగ్రీవ విజయం అందుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉమ్మడి నల్లగొండలోని సూర్యాపేట జిల్లాలో ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి.

కోదాడ మున్సిపాల్టీలో మూడు వార్డులు ఏకగ్రీవం కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చెరో వార్డు ఏకగ్రీవమయ్యాయి. అలాగే, మహబూబ్‌నగర్, మెదక్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ మెజార్టీ ఏకగ్రీవ విజయాలు అందుకుంది. ఏకగ్రీవ వార్డుల్లో మహిళలు మెజార్టీగా ఉండటం విశేషం.

ఏకగ్రీవ వార్డుల వివరాలు :

జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మున్సిపాలిటీ వార్డు–10 (ST జనరల్)లో పీ.విక్రమ్ (BRS) ఏకగ్రీవ విజయం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ వార్డు–17 (SC మహిళ)లో చింతల ఉమామహేశ్వరి (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నిక

ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ వార్డు–15 (UR మహిళ)లో తమ్మినేని మంగతాయి (కాంగ్రెస్) విజయం

నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ వార్డు–10 (BC మహిళ)లో చంద్రకళ పిల్లి (కాంగ్రెస్) ఏకగ్రీవ గెలుపు

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపాలిటీ వార్డు–3 (BC మహిళ)లో సులావ నాగలక్ష్మి (కాంగ్రెస్) ఏకగ్రీవ విజయం

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–11 (UR మహిళ)లో దేవరపల్లి మల్లేశ్వరి (కాంగ్రెస్) ఎన్నిక

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–21 (BC మహిళ)లో కట్టెబోయిన జ్యోతి (కాంగ్రెస్) గెలుపు

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–31 (UR మహిళ)లో యెర్నేని కుసుమ కుమారి (కాంగ్రెస్) ఏకగ్రీవ విజయం

మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు–58 (UR మహిళ)లో బి.రమాదేవి (కాంగ్రెస్) ఎన్నిక

మెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీ వార్డు–32 (UR మహిళ)లో గోదల మానస (కాంగ్రెస్) గెలుపు

పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు–1 (UR మహిళ)లో మడిపెల్లి విజయ (కాంగ్రెస్) విజయం

వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు–1 (UR జనరల్)లో అనంత్ రెడ్డి పటోల్ల (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నిక

వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు–15 (SC జనరల్)లో పీ.విజయలక్ష్మి (BRS) విజయం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ వార్డు–10 (BC మహిళ)లో గుండ్లపల్లి వాణి (కాంగ్రెస్) ఏకగ్రీవంగా ఎన్నికైంది.

ఇవి కూడా చదవండి :

Woman Advocate Murder : మహిళా న్యాయవాది దారుణ హత్య
Pawan Kalyan : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం

Latest News