Murder | ఓ వ్యక్తి క్రూర మృగంలా ప్రవర్తించాడు. తన ప్రియురాలి భర్తను అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని పాలిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పాలికి చెందిన జోగేంద్రకు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. జోగేంద్ర భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె ప్రియుడు.. జోగేంద్రను దారుణంగా హత్య చేశాడు. తల నుంచి మొండెంను వేరు చేశాడు. తలను, కాళ్లను, చేతులను నిందితుడు తన తోటలో పూడ్చిపెట్టాడు. మొండెంను సమీప అడవుల్లో పడేశాడు.
జోగేంద్ర ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా ఈ విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు మదన్ లాల్.. శరీర భాగాలను పూడ్చిపెట్టిన ప్రాంతంలో మామిడి మొక్కను పెంచినట్లు పోలీసులు తెలిపారు. జోగేంద్రను తానే చంపినట్లు మదన్‌లాల్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.