Site icon vidhaatha

Danger stunt: రీల్స్ వెర్రి..రైలుకు వేలాడుతు డేంజర్ స్టంట్!

Danger stunt: సెల్ఫీలు, రీల్స్ పిచ్చితో యువత తమ ప్రాణాలతోనే చెలగాటమాడుతూ ప్రమాదకర స్టంట్లు చేయడం ఫ్యాషన్ గా మారింది. తాజాగా ఓ యువకుడు రీల్స్ మోజులో కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ ప్రమాదకర స్టంట్ చేసి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

యూపీలోని కాస్గంజ్, కాన్ఫూర్ స్టేషన్ల మధ్య ఓ యువకుడు కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ కొద్ధి దూరం ప్రయాణించాడు. రైలు వేగం తగ్గాక నేలపై దిగబోయి వెనక్కి పడిపోయాడు. అదృష్టవశాత్తు అతను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు.

రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుని మరి యువకుడు చేసిన డేంజరస్ స్టంట్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కాగా, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారులు యువకుడిపై చట్టపర చర్యలకు ఆదేశించారు.

 

Exit mobile version