3 Viral Videos | టెన్షన్ ఫీట్స్..అడ్వంచర్స్ కాదు దుస్సాహసాలు!

ఇటీవలి కాలంలో కొంత మంది రికార్డుల కోసమో..లేక సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకో లేనిపోని దుస్సాహసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

3 Viral Videos | ఇటీవలి కాలంలో కొంత మంది రికార్డుల కోసమో..లేక సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకో లేనిపోని దుస్సాహసాలు(Dangerous Stunts) చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నడుస్తున్న రైళ్ల కింద పట్టాలపై పడుకోవడం, బైక్ రైడింగ్ ఫీట్స్, ట్రెక్కింగ్ ఫీట్స్ చేస్తూ కొందరు..సముద్రాలు, నదులలో ఫీట్స్ చేస్తూ మరికొందరు ప్రాణంతక స్టంట్లతో వైరల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొందరు విజయవంతమైతే..మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

తాజాగా ఓ యువకుడు తను కేర్ టేకర్ గా వ్యవహరించే ఓ భారీ మొసలితో నీటి మడుగులో కవ్వింపు చర్యల(crocodile stunt)కు పాల్పడిన వీడియో వైరల్ గా మారింది. నీటిలో మొసలి ముందు నిలబడి దానిని రెచ్చగొడుతున్న యువకుడు దుస్సాహసమైన స్టంట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇందులో ఏ మాత్రం తేడా వచ్చిన అతను మొసలి నోటికి ఫలహారంగా మారేవాడేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరో వీడియోలో ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టి(king cobra kiss) మరో అడ్వంచర్ ఫీట్ నిర్వహించారు. అయితే ఇంకో వ్యక్తి కొండ చిలువను చేతిలో పట్టుకుని ఉండగా..అది అతని పెదవులను గట్టిగా కరచుకోవడం(python bite incident)తో విలవిలలాడిపోయాడు. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఎందుకొచ్చిన తంటాలురా బాబు ఇలాంటి దుస్సాహసాలు అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

Latest News