విధాత : సముద్ర పక్షులు పెంగ్విన్ ల జీవనశైలీ స్ఫూర్తిదాయకమంటారు జంతు శాస్త్రవేత్తలు. జీవిత కాలంలో పెంగ్విన్ లు సగం కాలం సముద్రంలో, సగభాగం భూమిపైన మంచు ప్రాంతాల్లో మనుగడ సాగిస్తుంటాయి. గుంపులుగా సంచరిస్తూ జీవించే పెంగ్విన్ లు తమ ప్రయాణాన్ని వరుస పద్దతిలో అచ్చంగా నగరాల్లోని రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తున్నాయన్నట్లుగా కొనసాగిస్తుంటాయి.
ఇటీవల ఓ పెంగ్విన్ వెలుతున్న దారికి పర్యాటకులు అడ్డుగా ఉండటంతో వారు పక్కకు జరిగే వరకు అది ఓపికగా ఎదురుచూసి ముందుకు జరిగిన తీరు స్పూర్తిదాయకంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అంటార్కిటికా మంచు ప్రాంతంలో పర్యాటకులు దారి అడ్డంగా ఉండటంతో ఓ పెంగ్విన్ ఎంతో ఓపికగా ఎదురుచూసింది. వారు దారి ఇవ్వగానే మర్యాదగా ముందుకు సాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల విడుదలైన ఓ డాక్యుమెంటరీలో అంటార్కిటికాలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, మనుషులను చూసి భయపడిన పెంగ్విన్ల గుంపు ఆహారం కోసం సముద్రం వైపు పరిగెత్తాయి.’అడిలీ పెంగ్విన్’ మాత్రం ఒంటరిగా మంచు పర్వతం వైపు నడక ప్రారంభించింది. మంచుధాటికి అది ప్రాణాలు కోల్పోతుందన్న ఆందోళనతో డాక్యుమెంటరీ నిర్వాహకులు దానిని తిరిగి గుంపు లో చేర్చారు. అయినా అది తిరిగి మంచు పర్వతంపైకి ఒంటరిగా నడక ప్రారంభించడం పరిశోధకులను సైతం విస్మయపరిచింది. ఆ పెంగ్విన్ కు అది డెత్ మార్చ్ వంటిదని.. కొన్ని సార్లు వాటి మానసిక పరిస్థితి మేరకు అవి తమ మార్గ నిర్ధారణలో గందరగోళానికి గురువుతూ ఇలా చేస్తుంటాయని భావిస్తున్నారు.
పెంగ్విన్ ఓపికకు నెటిజన్లు ఫిదా
అంటార్కిటికా మంచు ప్రాంతంలో పర్యాటకులు దారి అడ్డంగా ఉండటంతో ఓ పెంగ్విన్ ఎంతో ఓపికగా ఎదురుచూసింది.
వారు దారి ఇవ్వగానే మర్యాదగా ముందుకు సాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/V7aY7Byict
— greatandhra (@greatandhranews) January 26, 2026
