Python Attack Zoo Keeper : జూ కీపర్ పై కొండ చిలువ దాడి.. వీడియో వైరల్

యూరప్‌లో ఒక జూ కీపర్‌పై 15 అడుగుల కొండచిలువ దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. క్లీనింగ్ చేస్తున్న మహిళను చుట్టేసి మింగేందుకు ప్రయత్నించగా, తోటి సిబ్బంది చాకచక్యంగా రక్షించారు.

Python Attack Zoo Keeper

విధాత : వన్య ప్రాణులతో మానవులు ఎంత సహవాసం చేసినా..వాటితో ముప్పు మాత్రం ఎప్పుడు పొంచి ఉంటునే ఉంటుంది. నిత్యం వన్య ప్రాణులు, సరీసృపాలతో సహవాసం చేసే సర్కస్ సిబ్బంది, జూ కీపర్లు సైతం తరుచూ వాటి దాడుల బారిన పడుతున్న ఘటనలు వెలుగు చూస్తునే ఉన్నాయి. తాజాగా ఓ జూ కీపర్ పై భారీ కొండ చిలువ దాడి వైరల్ గా మారింది.

యూరఫ్ దేశానికి చెందిన ఓ జూలో కొండ చిలువలకు కేటాయించిన ఆవాస ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు జూ కీపర్ గా పనిచేస్తున్న మహిళా సిబ్బంది అక్కడికి వెళ్లారు. జూ కీపర్ 15అడుగుల కొండచిలువ నివాసంలోని నీటి కొలనులోని పాత నీటిని ఖాళీ చేసి కొత్త నీటిని నింపడం..ఆవరణ శుభ్రం చేసే పనుల కోసం ఆమె కొండ చిలువ ఆవరణలోనకి వెళ్లింది. అయితే కొండ చిలువ ఎంత దూరంలో ఉందో చూసుకోకుండా నేరుగా దాని నివాసంలోకి వెళ్లింది. కాలు జారీ నీటిలో పడగా..పక్కనే గట్టున ఉన్న కొండ చిలువ ఈ గందరగోళానికి ఆగ్రహించింది. జూ కీపర్ పై దాడి చేసింది. పెద్దగా నోరు తెరిచి ఆమె కాలును పట్టుకోవడంతో పాటు ఆమెను మింగే ప్రయత్నంలో శరీరాన్ని చుట్టేసింది.

అకస్మాత్తుగా జరిగిన కొండ చిలువ దాడి నుంచి జూ కీపర్ తప్పించుకునే ప్రయత్నం చేసినా..దాని పట్టు నుంచి తప్పించుకోలేకపోయింది. కొండ చిలువ దాడితో ప్రాణాపాయ స్థితిలో పడిపోయిన ఆ జూ కీపర్ ను తోటి జూ సిబ్బంది గమనించి రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వన్యప్రాణులు, సరీ సృపాల వద్ద చాల భద్రతతో కూడిన చర్యలు తీసుకోవాలని..అలవాటైన పనే కదా అని నిర్లక్ష్యంగా ఉంటే వాటి బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Rakesh Bedi | సక్సెస్ మీట్‌లో ముద్దు.. రాకేశ్ బేడీపై నెటిజన్ల ట్రోల్స్, వివరణ ఇచ్చిన నటుడు
Australia vs England : హెడ్ సూపర్ సెంచరీ..ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యత

Latest News