Site icon vidhaatha

Renuka Chowdhary | మహిళలను మోసం చేసిన కేసీఆర్ సర్కారు: రేణుకా చౌదరి

Renuka Chowdhary

విధాత, తెలంగాణలోని 50 లక్షల మందికి పైగా మహిళలను కేసీఆర్ మోసం చేశారని, అభయహస్తం, బంగారు తల్లి పధకాలు ఎక్కడికి వెళ్ళాయో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి రేణుకా చౌదరి విమర్శించారు.

దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారని, డ్వాక్రా రుణాలు కట్టాలని మహిళలను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందన్నారు. పాల్వంచలో కెటిపీఎస్‌ను కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చేశామని, కేసీఆర్ పాలనలో 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఎందుకు ఆగిపోయిందో చెప్పాలన్నారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే అవినీతి వలన ఆ ప్రభుత్వం పతనం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మహిళలకు ఎలాంటి సహాయం అందడం లేదన్నారు.

కేసీఆర్ మొదటి క్యాబినెట్ లో మహిళా మంత్రినే లేరన్నారు. గిరిజన హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో ప్రభుత్వం నిర్ధిష్ట లెక్కలు వెల్లడించాలన్నారు.

Exit mobile version