Site icon vidhaatha

Rinku Singh: సమాజ్ వాదీ పార్టీ ఎంపీతో.. రింకూసింగ్ పెళ్లి!

విధాత: హైదరాబాద్ : టీమిండియా క్రికెటర్, హార్డ్ హిట్టర్ రింకూసింగ్ త్వరలో నే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రింకూసింగ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. రాజకీయ కుటుంబానికి చెందిన 25 ఏళ్ల ప్రియ సరోజ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచిలీషహర్‌ లోక్ సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఆమె గతంలో సుప్రీం కోర్టు న్యాయవాదిగా పనిచేశారు. రింకు, ప్రియకు ఏడాది ముందు నుంచే పరిచయం ఉందని గతంలో ప్రియ తండ్రి, ఎమ్మెల్యే తుపాని సరోజ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ పరస్పరం ఇష్టపడ్డారని..పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. జూన్‌ 8న వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు వారి కుటుంబ వర్గాల సమాచారం.

లఖ్‌నవూలోని ఓ లగ్జరీ హోటల్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరుగనున్నట్లుగా తెలుస్తోంది. వారి పెళ్లి వారణాసిలో నవంబర్ 18న హోటల్ తాజ్‌లో గ్రాండ్‌గా జరగనుంది. 27 ఏళ్ల రింకూ సింగ్ భారత టీ20 జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఈ యూపీ క్రికెటర్ టీమిండియా తరపున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఐపీఎల్ లో ధనాధన్ షాట్లతో అభిమానులను సంపాదించుకున్నాడు.

Exit mobile version