Love Feelings | భోపాల్ : ఇది షాకింగ్ ఘటన.. వారిద్దరికి ఫీలింగ్స్ కలిగాయట.. ఇంకేముంది కాబోయే అల్లుడి తల్లితో ఓ 50 ఏండ్ల వ్యక్తి జంప్ అయ్యాడు. కుమార్తె నిశ్చితార్థానికి ముందు తండ్రి ఇలా చేయడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉజ్జయిన్‌లోని ఉంట్వాసా గ్రామానికి చెందిన 45 ఏండ్ల మహిళ వారం రోజుల క్రితం అదృశ్యమైంది. దీంతో తన తల్లి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు.. సదరు మహిళ చిక్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల రైతుతో కలిసి జీవిస్తున్నట్లు కనుగొన్నారు. అక్కడికి వెళ్లిన కుమారుడు.. తన తల్లిని చూసి షాక్ అయ్యాడు.
సీన్ కట్ చేస్తే..
తనకు కాబోయే భార్య తండ్రితో తన తల్లి కలిసి ఉండడాన్ని చూసి కుమారుడు షాక్ అయ్యాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. మీ వివాహ వేడుకలకు సంబంధించి మాట్లాడుకునే సమయంలో తమలో ఫీలింగ్స్ కలిగాయని వారు చెప్పడంతో అతను మరింత షాక్ అయ్యాడు. మరో వారం రోజుల్లో రైతు బిడ్డతో కుమారుడికి నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. అంతలోనే తల్లి అదే రైతుతో జంప్ కావడం అతన్ని షాక్‌కు గురి చేసింది.
ఒంటరిగా రైతు..
కొన్నేండ్ల క్రితం రైతు భార్య చనిపోయింది. అప్పట్నుంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఇటీవలే ఓ బిడ్డకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన ఆయన.. తనకు కాబోయే అల్లుడి తల్లిపై మనసు పారేసుకుని ఆమెతో జంప్ అయ్యాడు.
ప్రియుడితోనే ఉండిపోతా.. భర్త అక్కర్లేదు
పోలీసులు వారిద్దరికి కౌన్సెలింగ్ నిర్వహించగా.. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తాను తన ప్రియుడితోనే ఉండిపోతాను.. భర్త అక్కర్లేదని తెగేసి చెప్పింది. ఆమెకు 20, 18 ఏండ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఎంగేజ్‌మెంట్ కూడా రద్దు అయింది.
