Site icon vidhaatha

Kannappa: క‌న్న‌ప్ప నుంచి.. శివ‌ శివ శంక‌ర సాంగ్ రిలీజ్‌! విష్ణు హిట్ కొట్టేలానే ఉన్నాడే

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెర‌కెక్కుతున్న చిత్రం క‌న్న‌ప్ప‌ (Kannappa). ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాకు ముకేశ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈక్ర‌మంలో తాజాగా ఈ సినిమా నుంచి శివ‌ శివ శంక‌ర అంటూ సాగే లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. రామ జోగ‌య్య శాస్త్రి ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా పాట‌లో ప్ర‌తి చ‌ర‌ణం, లైన్ ఎంతో హృద్యంగా శివ భ‌క్తులు భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగేలా చేశారు. కేర‌ళ‌కు చెందిన మ్యూజిక్ సెన్షేష‌న్ స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించగా విజ‌య్ ప్ర‌కాష్ ఆల‌పించారు. పాట విడుద‌లైన గంట‌ల్లోనే మిలియ‌న్ల‌లో వ్యూస్ సాధించి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటోంది. ప్రేక్ష‌కుల నుంచి కూడా ఫ‌స్ట్ టైం పాజిటివ్ కామెంట్లు భారీగా వ‌స్తున్నాయి.

 

Exit mobile version