Urination incident | ఆ ఆదివాసీ కాళ్లు క‌డిగిన‌ క‌డిగిన ముఖ్య‌మంత్రి.. నెట్టింట ఫోటోలు వైర‌ల్

Urination incident | ఆదివాసీ యువ‌కుడిపై మూత్ర విస‌ర్జ‌న చేయ‌డంపై దేశ వ్యాప్తంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మూత్ర విస‌ర్జ‌న చేసిన వ్య‌క్తి బీజేపీ ఎమ్మెల్యే కేద‌ర్‌నాథ్ శుక్లా ముఖ్య అనుచ‌రుడు అయినందునే సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌న్న విమర్శలు వెళ్లు వెత్తాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చౌహాన్ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఎవ‌రూ ఊహించని విధంగా.. బాధిత ఆదివాసీ ద‌స్మ‌త్ రావ‌త్‌ను భోపాల్‌లోని స్మార్ట్ సిటీ పార్కుకు పిలిపించారు. అక్క‌డ అత‌నితో […]

  • Publish Date - July 6, 2023 / 06:22 AM IST

Urination incident | ఆదివాసీ యువ‌కుడిపై మూత్ర విస‌ర్జ‌న చేయ‌డంపై దేశ వ్యాప్తంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మూత్ర విస‌ర్జ‌న చేసిన వ్య‌క్తి బీజేపీ ఎమ్మెల్యే కేద‌ర్‌నాథ్ శుక్లా ముఖ్య అనుచ‌రుడు అయినందునే సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌న్న విమర్శలు వెళ్లు వెత్తాయి.

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చౌహాన్ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఎవ‌రూ ఊహించని విధంగా.. బాధిత ఆదివాసీ ద‌స్మ‌త్ రావ‌త్‌ను భోపాల్‌లోని స్మార్ట్ సిటీ పార్కుకు పిలిపించారు. అక్క‌డ అత‌నితో క‌లిసి సీఎం మొక్క‌లు నాటారు. అనంత‌రం అక్క‌డున్న ఓ కార్యాల‌యంలో ఆదివాసీ పాదాలు క‌డిగారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న‌కు చింతిస్తూ క్ష‌మాప‌ణ‌లు కోరారు సీఎం.

కాగా, నిందితుడు ప్రవేశ్‌ శుక్లాను బుధవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. కుబ్రి గ్రామంలో ప్రవేశ్‌ శుక్లా అక్రమంగా నిర్మించిన ఇంటిని కూడా జిల్లా అధికారులు కూల్చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు కేదార్‌నాథ్‌ శుక్లా, రాజేందర్‌ శుక్లాతో నిందితుడు కలిసివున్న ఫొటోలు సోషల్‌మీడియాలో విడుదలయ్యాయి.

Latest News