సిద్ధిపేట: 10 ఫలితాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలవాలి: మంత్రి హరీశ్‌రావు

విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లో గతేడాది తరహాలోనే ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆకాంక్షించారు. ఈ యేడు స్వయంగా తానే లక్షలాది రూపాయలు వెచ్చించి పదవ తరగతి విద్యార్థుల కోసం డిజిటల్ కంటెంట్ రూపొందించి జిల్లాలోని విద్యార్థులందరికీ అందజేశానని, ఆ డిజిటల్ కంటెంట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరం […]

  • Publish Date - February 25, 2023 / 05:24 AM IST

విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లో గతేడాది తరహాలోనే ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆకాంక్షించారు. ఈ యేడు స్వయంగా తానే లక్షలాది రూపాయలు వెచ్చించి పదవ తరగతి విద్యార్థుల కోసం డిజిటల్ కంటెంట్ రూపొందించి జిల్లాలోని విద్యార్థులందరికీ అందజేశానని, ఆ డిజిటల్ కంటెంట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

2020-21 విద్యా సంవత్సరం 98 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిస్తే, 2021-22 విద్యా సంవత్సరం 97 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామని మంత్రి చెప్పారు. గతేడాది స్ఫూర్తితో మూడు నెలల ముందు నుంచే స్వయంగా మంత్రి జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహించామని, వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచనలు చేశామన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా ఉత్తరం వ్రాయడంతో పాటు వారిని ఇంటి వద్ద ప్రశాంత వాతావరణంలో చదివించేలా తల్లిదండ్రులలో, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా జిల్లాలోని 10వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ, ఏంఈఓలు, డీఈఓతో కలిసి సుదీర్ఘంగా మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జిల్లా సిద్ధిపేట అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నది. ఇదే తరహాలో పదవ తరగతిలో పరీక్షా ఫలితాల్లో అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్ఫారం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహణతో విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టాలని, వారి భవితకు ఎంతో పునాదని, ఆ దిశగా పై చదువులకు ఈ పదవ తరగతి స్ఫూర్తి దాయకంగా ఉండాలని సూచించారు.

సబ్జెక్ వారీగా వీక్ ఉన్న విద్యార్థులను గమనించి గుర్తించి ఆయా విద్యార్థులు వంద శాతం అన్నీ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించేలా వారిని ప్రోత్సహించాలని ఉపాధ్యాయ బృందాలకు మంత్రి సూచించారు. పిల్లలకు తల్లిదండ్రులు వ్యవసాయ పనులు, ఇంటి పనులు ఈ రెండు నెలలు చెప్పొద్దని, పిల్లల జీవితం మలుపుతిప్పేది పదవ తరగతి పరీక్షలు కాబట్టి, పాఠశాలలోనే కాదు ఇంటి వద్ద కూడా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా తల్లిదండ్రులు సహకారాన్ని అందించాలని నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులు పలువురితో మంత్రి మాటామంతి కలిపారు.

పలువురు పదవ తరగతి తల్లిదండ్రులతో మీ బిడ్డ ఉదయమే 5 గంటలకు లేచి చదువుతున్నారా.. చదివేలా మీరు ప్రోత్సహించాలని, రెండు నెలల వరకూ టీవీ, సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని సూచించారు. 10/10 జీపీఏ సాధించే విద్యార్థులకు రూ.10వేలు నగదు బహుమతిగా అందిస్తానని, ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని కూడా ఘనంగా సన్మానిస్తానని పేర్కొన్నారు.

Latest News