SIM Card Rule |
ఇటీవల వెలుగులోకి వస్తున్న సిమ్‌కార్డుల అక్రమాల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది. సిమ్‌కార్డులను విక్రయిస్తున్న డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసినట్లు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. దీంతో నకిలీ సిమ్‌కార్డుల విక్రయాలకు, ఒకరికి ఒకటికంటే ఎక్కువ సిమ్‌కార్డుల విక్రయాలు జరుగకుండా అడ్డుకట్టపడుతుందన్నారు.
కొత్తగా టెలికాం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. పోలీస్ వెరిఫికేషన్ లేకుండా సిమ్‌కార్డులను విక్రయిస్తే రూ.10లక్షల వరకు జరిమానా విధించనున్నారు. దేశంలో దాదాపు 10లక్షల మంది వరకు సిమ్‌కార్డు డీలర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉండనున్నది. అలాగే వ్యాపారం, దుకాణాల కోసం కేవైసీని చేయించుకోవాల్సి ఉంటుంది.