Site icon vidhaatha

Haragopal | కర్రెగుట్టలో.. కాల్పులను కేంద్రం నిలిపి వేయాలి

విధాత వరంగల్ ప్రతినిధి: ఛత్తిస్ ఘడ్ తెలంగాణ సరిహద్దులలోని కర్రెగుట్టల్లో కాల్పులను కేంద్ర ప్రభుత్వం నిలిపి వేయాలని హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. పౌర హక్కుల సంఘo, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలోని వరంగల్ ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. గత ఐదు రోజులుగా ఛత్తిస్ ఘడ్ తెలంగాణ సరిహద్దులలోని కర్రెగుట్టలో సాయి ద పోలీస్ బలగాలు కొనసాగిస్తున్న కాల్పులను కేంద్ర ప్రభుత్వం తక్షణం నిలిపి వేయాలని విన్నవించారు. మధ్య భారతంలో విచక్షణ రైతన్న కొనసాగిస్తున్న ఆదివాసుల హననాన్ని ఆపాలనన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని సూచించారు.

దేశం లో శాంతి యుత వాతావరణం ఏర్పాటుకు ఈ కేంద్రం చర్చలు జరపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. విప్లవ పార్టీలు, ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగితే అందరికీ ఉపయోగకరమనే అంశాన్ని గుర్తించాలని సూచించారు. మావోయిస్టులు, కేంద్రం మధ్య జరుగుతున్న పోరాటంలో అమాయకమైన ఆదివాసీ ప్రజలు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బ్రిటిష్ కాలం నుంచి మావోయిస్టు పార్టీ ఉన్నదన్నారు.

ఆదివాసి ప్రజలు భయానక వాతావరణం లో ఉన్నారన్నారు. క్షేత్రస్థాయి అంశాలను పక్కదోవ పట్టించి స్మశానంలో చర్చలు జరపాలని కేంద్రం అనుకుంటున్నది….పోరాటం చేస్తున్న వారితో శాంతి చర్చలు జరపితినే పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు పార్టీ లేఖలు రాసినప్పటిక్కీ కర్రెగుట్ట ను వేలాది మంది తో ముట్టడించడం సరికాదన్నారు. కేంద్రం సాగిస్తున్న యుద్ధం అపాలని…సమాజ కోరిక మేరకు ముందుకు రావాలని అరగోపాల్ తదితరులు కోరారు. ఈ మీడియా సమావేశంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Exit mobile version