విధాత : గువహాటిలోని బర్సపరా స్టేడియంలో భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుండగా అనుకోని అతిథి స్టేడియంలో ప్రత్యక్షమైంది. పిచ్‌పై పాము ప్రత్యక్షం కావడంతో ప్లేయర్లంతా షాక్‌కు గురయ్యారు. కాసేపు ఆట ఆగిపోయింది.
ఇండియా ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్ పూర్తయి.. ఎనిమిదో ఓవర్ ప్రారంభానికి ముందు.. పిచ్‌పై పాము ప్రత్యక్షమైంది. దీంతో క్రికెటర్లంతా పాము వైపే చూశారు. ఒక్కసారిగా మ్యాచ్ ఆగిపోవడంతో.. అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి ఆ పామును సిబ్బంది పట్టేసింది. ఆ తర్వాత బయటకు తీసుకెళ్లారు. మళ్లీ తిరిగి ఆట ప్రారంభమైంది.
ఇదొక్కటే కాదు మ్యాచ్‌లో నిర్వాహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దక్షిణాఫ్రికా ఛేదనలో దీపక్ చాహర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతి వేసిన తర్వాత స్టేడియంలోని నాలుగు ఫ్లడ్ లైట్లలో ఒక ఫ్లడ్‌లైట్ ఆగిపోయింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. ఆటకు 18 నిమిషాలు అంతరాయం కలిగింది.