Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు సీబీఐ నోటీసులు !

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఢిల్లీ హైకోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Kavitha

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత సీబీఐ అధికారులు నోటీసులు అందించారు. రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ కేసును కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసింది. ఈ పిటిషన్ విచారణ నిమిత్తం ఈనెల 16న ఢిల్లీ హైకోర్టులో హియరింగ్ కు హాజరుకావాలని సీబీఐ అధికారులు కవితకు నోటీసులు అందించారు. హైదరాబాద్ లో ని కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు ఆ నోటీసులు అందచేశారు. కవిత భర్త అనిల్ ఆ నోటీసులు అందుకున్నారు.

సీబీఐ అధికారుల రాకతో కవిత నివాసం వద్ద మరోసారి అలజడి నెలకొంది. సీబీఐ అధికారులు కవిత నివాసానికి వచ్చిన సందర్బంలో ఆమె ఇంట్లో అందుబాటులో లేరు. దీంతో నోటీసులను ఆమె భర్త అనిల్ కుమార్‌కు అందజేశారు. ఆ సమయంలో కవిత ఎక్కడ ఉన్నారు..ఎప్పుడు అందుబాటులోకి వస్తారు అనే వివరాలను సీబీఐ అధికారులు అడిగి తెలుసుకున్నారు. కవితతో సహా ఢిల్లీ లిక్కర్ కేసులోని నిందితులు 23మందికి కూడా సీబీఐ నోటీసులు అందచేయడం గమనార్హం. వారంతా కూడా ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టు హియరింగ్ కు హాజరుకావాలని సీబీఐ ఆ నోటీస్ లలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

Osmania University | ఉస్మానియా యూనివ‌ర్సిటీలో మ‌ళ్లీ క‌ట్టెల పొయ్యిలు..! పూరీ, వ‌డ‌, రోటీ బంద్..!!
Farooq Abdullah | జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లాపై హ‌త్యాయ‌త్నం..! వీడియో

Latest News