Farooq Abdullah | జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లాపై హ‌త్యాయ‌త్నం..! వీడియో

Farooq Abdullah | జ‌మ్మూక‌శ్మీర్( Jammu Kashmir ) మాజీ సీఎం, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధ్య‌క్షుడు ఫ‌రూక్ అబ్దుల్లా( Farooq Abdullah )పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య వెళ్తున్న ఫ‌రూక్ అబ్దుల్లాపై ఓ వ్య‌క్తి తుపాకీ( Pistol )తో కాల్పులు జ‌రిపాడు.

Reported by: raj | జాతీయం | Mar 12, 2026, 7:55 am IST
Read Time: 4 mins
Farooq Abdullah | జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లాపై హ‌త్యాయ‌త్నం..! వీడియో

Farooq Abdullah | జ‌మ్మూక‌శ్మీర్( Jammu Kashmir ) మాజీ సీఎం, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధ్య‌క్షుడు ఫ‌రూక్ అబ్దుల్లా( Farooq Abdullah )పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య వెళ్తున్న ఫ‌రూక్ అబ్దుల్లాపై ఓ వ్య‌క్తి తుపాకీ( Pistol )తో కాల్పులు జ‌రిపాడు. కానీ ఆ కాల్పుల నుంచి అబ్దుల్లా త‌ప్పించుకున్నారు. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది.. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఎన్సీ అధ్య‌క్షుడు ఫ‌రూక్ అబ్దుల్లా.. జ‌మ్మూక‌శ్మీర్ డిప్యూటీ సీఎం సురీంద‌ర్ చౌద‌రి క‌లిసి జ‌మ్మూలోని గ్రేట‌ర్ కైలాష్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు హాజ‌ర‌య్యారు. వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన అనంత‌రం అబ్దుల్లా తిరిగి వెళ్తుండ‌గా.. ఆయ‌న వెనుకాలే వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌న జేబుల్లో నుంచి తుపాకీ తీసి కాల్పులు జ‌రిపాడు. కానీ ఆ బుల్లెట్లు అబ్దుల్లాకు తాక‌లేదు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది.. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని పురాణీ మండికి చెందిన 65 ఏళ్ల కమల్ సింగ్ జమ్వాల్‌గా గుర్తించారు. అతడి నుంచి పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన బంధువు కుమారుడి పెళ్లికి వచ్చిన నిందితుడు, 20 ఏళ్లుగా ఫరూక్ అబ్దుల్లాను చంపాలని కుట్ర చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తన తండ్రిపై జరిగిన హత్యాయత్నం పట్ల ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణలో ఉన్న వ్యక్తికి ఇంత దగ్గరగా దుండగుడు ఎలా రాగలిగారని ఆయన ప్రశ్నించారు.