విధాత, హైదరాబాద్: తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్ రాబోతున్నారు. ప్రస్తుత ఇన్ చార్జీ డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే ఏప్రిల్ నెలాఖరులో పదవీ విరమణ పొందనున్నారు. అప్పటిలోగా కొత్త డీజీపీ ఎంపికకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. కొత్త డీజీపీ ఎంపిక కోసం రాష్ట్రం నుంచి అర్హత కల్గిన పోలీస్ అధికారుల జాబితాను గత నెల 23న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)కు పంపించింది. కొత్త డీజీపీ ఎంపిక పక్రియ కోసం ఢిల్లీలో బుధవారం జరిగిన యూపీఎస్సీ ఎంప్యానెల్ కమిటీ సమావేశానికి రాష్ట్రం నుంచి సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఐపీఎస్ అధికారులకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టును పరిశీలించిన యూపీఎస్సీ కమిటీ ముగ్గురి పేర్లను ఖరారు చేసింది.
వారిలో 1991బ్యాచ్ కు చెందిన సీవీ. ఆనంద్, 1994బ్యాచ్ కు చెందిన కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరక్టర్ వినాయక్ ప్రభాకర్ ఆప్టే, తెలంగాణ జైళ్ల శఆఖ డైరక్టర్జ జనరల్ సౌమ్యా మిశ్రాలు ఉన్నారు. యూపీఎస్సీ ఖరారు చేసిన ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితా రాష్ట్ర ప్రభుత్వానికి అందగానే వారి నుంచి ఒకరిని కొత్త డీజీపీని ఎంపిక చేయనుంది.
ముగ్గురిలో ఆనంద్ కే అవకాశం
యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వానికి పంపనున్న డీజీపీ అర్హుల జాబితా నుంచి కొత్త డీజీపీగా ప్రస్తుత రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ నియామితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. బ్యాచ్ పరంగా ఆనంద్ సీనియర్ కావడం, రాష్ట్రంలోనే ఆయన ఏఎస్సీ నుంచి డీజీపీ హోదా వరకు పలు స్థానాల్లో సుదీర్ఘ కాలం పనిచేయడం ఆయనకు కలిసిరానుంది. ఈ జాబితాలోని వినాయక ప్రభాకర్ ఆప్టే కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరక్టర్ గా ఉన్నారు. ఆయన కేంద్ర సర్వీసుల్లో మరింత ఉన్నత హోదాలకు చేరుకునే అవకాశం ఉండటంతో తిరిగి తెలంగాణ కేడర్ లోకి రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మిగిలిన మూడో పేరు సౌమ్యా మిశ్రా కంటే ఆనంద్ సీనియర్ కావడంతో కొత్త డీజీపీగా ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కొత్త డీజీపీగా ఆనంద్ వైపు సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.
తెలంగాణకు ఈసారి పూర్తి కాలపు డీజీపీ !
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి డీజీపీగా అనురాగ్ శర్మ తాత్కాలిక ప్రతిపాదికన ఎంపికై..పిదప యూసీఎస్సీ ద్వారా 2015న నవండర్ 13న పూర్తికాలపు డీజీపీగా నియామితులయ్యారు. 2017 నవంబర్ 12వరకు కొనసాగారు. తర్వతా కూడా మహేందర్ రెడ్డి తాత్కాలిక డీజీపీగా నియామితులై..తదుపరి యూపీఎస్సీ ద్వారా పూర్తికాలపు డీజీపీగా ఎంపికై..రాష్ట్రంలో అత్యధిక కాలం ఐదేళ్లకుపైగా ఆ పదవిలో కొననసాగి 2022వరకు పనిచేశారు. ఆ తర్వాత అంజనీకుమార్, రవిగుప్తా, జితేందర్ సహా ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి సైతం తాత్కాలిక డీజీపీ హోదాలో పనిచేశారు. ఈ ధఫా యూపీఎస్సీ ఖరారైన జాబితా నుంచి ఎంపిక కానున్న డీజీపీ తెలంగాణకు మూడో పూర్తి కాలపు డీజీపీ కానుండటం విశేషం.
ఇవి కూడా చదవండి :
ఎల్పీజీ కొరతపై పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాల నిరసన!
Bigg Boss | ‘బిగ్‌బాస్’ ట్రోఫీ గెలిచినా ఇంకా అందని ప్రైజ్‌మనీ.. విజేత ఎమోషనల్ కామెంట్స్ వైరల్
