iBomma Hits Back At Cyber Crime Police | తెలంగాణ పోలీస్ కు ఐబొమ్మ కీలక వార్నింగ్
తెలంగాణ పోలీస్ పై ఐబొమ్మ ఘాటు వార్నింగ్.. మా మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో చేస్తామని హెచ్చరిక, సినీ ఇండస్ట్రీపై విమర్శలు.

విధాత : ఐబొమ్మ వెబ్ సైట్ ఏకంగా తెలంగా పోలీస్ శాఖకే వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత సీపీ ఆనంద్ తదుపరి లక్ష్యంగా తాము ఐబొమ్మ అనే వెబ్ సైట్ పై ఫోకస్ చేశామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. ఈ వ్యాఖ్యలపై ఐబొమ్మ వెబ్ సైట్ స్ట్రాంగ్ కౌంటర్ తో పాటు తెలంగాణ పోలీస్ శాఖకు వార్నింగ్ జారీ చేసింది. మీరు ఐ బొమ్మ మీద ఫోకస్ చేస్తే.. మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అంటూ హెచ్చరించింది. మా వెబ్ సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి..లేదంటే మేం మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది. మా వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయట పెడతామంటూ ప్రకటించింది. 5 కోట్ల మందికిపైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉందంటూ బెదిరించింది. మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవని తెలిపింది. ఓటీటీలులు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటకు వస్తాయని.. మమ్మల్ని అడ్డుకోవడం అసాధ్యమంటూ ఐబొమ్మ తన ప్రకటనలో పేర్కొంది.
సినీ ఇండస్ట్రీ వారే మా సైట్ పై బురద చల్లుతున్నారు
ఇకపై తాము ఎలాంటి ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్లు అడగబోమని, యూజర్లు జాగ్రత్తగా ఉండాలని ఐబొమ్మ స్పష్టం చేసింది. డుప్లికేట్ యాప్‌లు, నకిలీ వెబ్‌సైట్ల పేరుతో కొందరు మోసాలు చేస్తుండటంతో ఈ హెచ్చరికను జారీ చేసినట్లు తెలిపింది. అలాగే తన ప్రకటనలో సినిమా ఇండస్ట్రీలో పని చేసే వ్యక్తులే తమను దోషులుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. అలాగే, తాము ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు, సబ్‌స్క్రిప్షన్‌లు వసూలు చేయబోమని, తమ సైట్‌లో కేవలం ఉచితంగానే సినిమాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లు, యూట్యూబ్ ఛానల్స్ ఉద్దేశపూర్వకంగా ఐబొమ్మపై తప్పుగా ప్రచారం చేస్తున్నాయని, తాము ఎలాంటి హ్యాకింగ్ లేదా ఫోన్ ట్రాకింగ్ చేయబోమని మరోసారి హామీ ఇచ్చింది. ఐబొమ్మ పేరు మీద నకిలీ యాప్‌లు, నకిలీ సైట్లు వస్తున్నందున యూజర్లు వాటికి లోనవ్వకూడదని సూచించింది.
భారీ బడ్జెట్ లు పెట్టి..ప్రేక్షకులపై భారం
అలాగే హీరోల రెమ్యూనరేషన్ , వీదేశి ట్రిప్పులు, జల్సాలు, విదేశాల్లో షూటింగులపై ఐబొమ్మ కీలక ప్రశ్నలను సంధించింది. అనవసర ఖర్చులు, హీరోలకు వందల కోట్లు రెమ్మునరేషన్లు ఇచ్చి.. భారీ బడ్జెట్ చూపించి.. సామాన్య ప్రజలు ప్రేక్షకులపై ఆ ప్రభావం చూపుతున్నారని ఐబొమ్మ మండిపడింది. ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా.. అక్కడి వాళ్లకు ఉపాధి కలుగుతుంది కదా అని సూచించింది. అలాగే డిస్ట్రిబ్యూటర్లకు సినిమా ప్రింట్ అమ్మిన తరువాత మీరు ఏమీ పట్టనట్లు.. కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ.. మా మీద ఫోకస్ పెట్టారని ప్రొడ్యూసర్లను ఐబొమ్మ నిలదీసింది. అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని ప్రేక్షకుల మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారని.. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్స్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారని.. చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడని ఐబొమ్మ ఆరోపించింది. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం.. అందులో తెలుగువారి కోసం ఆలోచిస్తాం. తాము ఒక భారతీయ సైట్ అని స్పష్టం చేసింది. చావుకు భయపడిన వాడు దేనికి భయపడడంటూ ఐబొమ్మ ఈ సందర్భంగా తన పోస్టులో పేర్కొంది.
" There is nothing more dangerous than a man who has nothing to loose.."
ఈక కూడా పీకేలేరు అని ibomma భావం 😂😂 https://t.co/mUBOZh3Dg3 pic.twitter.com/mz1pcRgyXL
— Kumaruuu💙 (@CalmnessSoull) September 30, 2025