GHMC Property Tax : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ఆఫర్ !

ఆస్తి పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ భారీ రాయితీ ప్రకటించింది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం కింద వడ్డీపై 90% మాఫీతో ఈ నెల 31లోపు పన్ను చెల్లించాలంటూ పౌరులకు సూచించింది.

విధాత, హైదరాబాద్ : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకం 2025–26ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. 2025-26 ఏడాదికి గానూ జీహెచ్‌ఎంసీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం రాయితీ ప్రకటించింది. వడ్డీ రాయితీతో ఈ నెల 31వ తేదీలోగా అస్తి పన్ను బకాయిలు చెల్లించడానికి గడువు విధించింది.

www ghmc.gov.in, MyCURE యాప్, మీ సేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్‌లలో బకాయిలు చెల్లించవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తెలిపారు. పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా నగర మౌలిక సదుపాయాలు, పౌర సేవలు మరింత బలోపేతం చేయడంలో సహకారం అందించాలని కోరింది.

ఇవి కూడా చదవండి :

Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు సీబీఐ నోటీసులు !
LPG Gas Shortage | గ్యాస్ కొరతతో కరెంటు పొయ్యిల ధరలకు రెక్కలు!

Latest News