HYDRAA | హైడ్రాకు కొనసాగుతున్న అభినందనల వెల్లువ

వరద ముప్పును తప్పించిన హైడ్రాకు పలు కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ర్యాలీగా వచ్చి హైడ్రాకు మానవహారంగా నిలబడ్డారు. అమీర్‌పేట, శ్రీనివాస్ నగర్, గాయత్రినగర్, కృష్ణ నగర్, అంబేద్కర్ నగర్ నుంచి వచ్చినా ఆ కాలనీల ప్రతినిధులు మైత్రివనం వద్ద ప్లకార్డులను ప్రదర్శించి హైడ్రాకు సంఘీభావం తెలిపారు.

HYDRAA | హైడ్రాకు కొనసాగుతున్న అభినందనల వెల్లువ

విధాత, హైదరాబాద్ : 

వరద ముప్పును తప్పించిన హైడ్రాకు పలు కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ర్యాలీగా వచ్చి హైడ్రాకు మానవహారంగా నిలబడ్డారు. అమీర్‌పేట, శ్రీనివాస్ నగర్, గాయత్రినగర్, కృష్ణ నగర్, అంబేద్కర్ నగర్ నుంచి వచ్చినా ఆ కాలనీల ప్రతినిధులు మైత్రివనం వద్ద ప్లకార్డులను ప్రదర్శించి హైడ్రాకు సంఘీభావం తెలిపారు. 5 సెంటీమీటర్ల వర్షం పడితే అతలాకుతలం అయిన మా కాలనీలకు వరద ముప్పు తప్పించారంటూ హైడ్రాను కీర్తించారు. అమీర్ పేట మైత్రివనం వద్ద నడుములోతు నీళ్లు నిలబడి ఇబ్బందులు పడేవాళ్ళం అని హైడ్రా వచ్చి అక్కడి భూగర్భ పైపులైన్లలో పూడికను పూర్తిగా తొలగించిందన్నారు. దీంతో ఇటీవల 15 సెంటీమీటర్ల వర్షం పడిన వరద నీరు నిలవలేదు అని చెబుతూ హైడ్రా పనితీరుకు అభినందనలు తెలిపారు. ఎక్కడికక్కడ నాళాల్లో పూడిక పేరుకుపోవడంతో అంబేద్కర్ నగర్లో డ్రైనేజీ రోడ్లమీద పారేదని.. నేడు హైడ్రా చర్యలతో ఆ సమస్య పరిష్కారం అయ్యిందని అక్కడి నివాసితులు పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలో హైడ్రా అనేక విజయాలు సాధించిందన్నారు.

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా ఇక్క‌డ‌కు వ‌చ్చి స‌మ‌స్య‌ను తెలుసుకుని ప‌రిష్కార బాధ్య‌త‌ను హైడ్రాకు అప్ప‌గించారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ అనేక సార్లు ప‌రిశీలించి స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకున్నారు. ‘ఈ మార్గంలో ప్ర‌యాణించేవారికి ఇక్క‌డి క‌ష్టం తెలుసు.. హైడ్రాతోనే ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యింది. హైడ్రాలాంటి వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు’ అంటూ కాలనీ వాసులు తెలిపారు. ప్యాట్నీ నాలాను విస్తరించి పైన ఉన్న ఏడెనిమిది కాలనీలకు వరద ముప్పు తప్పించిన హైడ్రాకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు వర్షవస్తె వణుకు వచ్చేదని.. ఇప్పుడా భయం లేదని చెబుతున్నారు.

పైగా కాల‌నీ, ప్యాట్నీ కాల‌నీ, విమాన్‌న‌గ‌ర్‌, బీహెచ్‌ఈ‌ఎల్ కాల‌నీ, ఇందిర‌మ్మ న‌గ‌ర్ ఇలా అనేక కాల‌నీల్లోని ఇండ్లల్లో సామాన్లను వరద నీటిలో మునిగిపోయేవని ఈ ఏడాది ఈ సమస్యలేమీ ఎదురు కాలేదని తెలిపారు. 70 అడుగుల నాలా ప్యాట్నీ వద్ద 15 నుంచి 18 అడుగుల‌కు కుంచించుకుపోవడంతో బ్బంది ఉండేదని.. హైడ్రా వచ్చి నాలా ను వాస్తవ వెడల్పునకు విస్తరించడంతో సమస్య పరిష్కారం అయ్యిందని చెబుతున్నారు. 30 ఏళ్లుగా ఈ స‌మ‌స్య ఉండ‌డం వ‌ల్ల వ‌ర్షం వ‌స్తే మా కార్ల‌న్నీ మునిగిపోయి ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్టాలు వ‌చ్చేవ‌ని వాపోయారు. దశాబ్దాల సమస్యను ఫిర్యాదు చేసిన వెంటనే హైడ్రా పరిష్కరించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నాలాను విస్త‌రించి వ‌ర‌ద‌ముప్పును త‌ప్పించార‌ని పేర్కొన్నారు.