Site icon vidhaatha

Sandhya Theater: సంధ్య థియేటర్ లో పాముల కలకలం..!

విధాత, హైదరాబాద్ :హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్..దీని పేరు వినగానే అందరికి పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఓ తల్లి ప్రాణం కోల్పోయి..కొడుకు తీవ్ర గాయాలకు గురైన తొక్కిసలాట ఘటన గుర్తుకొస్తుంది. తొక్కిసలాట ఘటనకు కారణమంటూ హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడు అదే సంధ్య థియేటర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి కూడా ప్రాణాలు పోయేంతటి ఘటనతోనే వార్తల్లో నిలిచింది. సంధ్య థియేటర్ లోని రూ.50టికెట్ కౌంటర్ సమీపంలో పాములు కనిపించాయి.

సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంత స్నేక్ క్యాచర్ ను రప్పించి పాములును బంధించి తరలించారు. తరుచు థియేటర్ ప్రాంగణంలో పాములు కనిపిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. అయితే పాములు థియేటర్ లోకి వెళితే ప్రేక్షకులకు ప్రమాదకరమని భావిస్తున్నారు.

 

Exit mobile version