Site icon vidhaatha

PRC అమలు చేయాలని జెన్కో ఉద్యోగుల ధర్నా

విధాత: గత ఏడాది ఏప్రిల్ నుంచి జెన్కో విద్యుత్ ఉద్యోగులకు PRC అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాగార్జునసాగర్ లోని జెన్కో కార్యాలయం ఎదుట జెన్కో ఉద్యోగులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన, ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా జెన్కో విద్యుత్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ పిఆర్సి అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ గత నాలుగు రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. అయినా యాజమాన్యం నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఆర్టిజన్లకు పర్సనల్ పే బేసిక్ లో కలపాలని, అన్ లిమిటెడ్ మెడికల్ పాలసీని అమలు చేయాలని, సింగిల్ మాస్టర్ స్కేల్, స్పెషల్ గ్రేడ్ ఫోర్ మెన్ పోస్టుల మంజూరు, తక్షణ PRC అమలు మొదలగు డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇకనైనా యాజమాన్యం ,ప్రభుత్వము ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో నాగార్జున సాగర్ జెన్కో జేఏసీ చైర్మన్ యం యాసయ్య, కన్వీనర్ సంజీవరెడ్డి ,కో చైర్మన్ కె.వి సత్యనారాయణ, కో కన్వీనర్ సైజు, శ్రావణ్ కుమార్, అంజయ్య ,నాగరాజు, రాము , సులక్ష్మి, కోటేశ్వరరావు, టీవీ రామకృష్ణ ,సుధాకర్ , శ్రీకర్ ,ఉమా ,రామకృష్ణ ,నాగరాజన్ , హరి ప్రసాద్, వలి, నరసింహ తదితరులు పాల్గొన్నారు

Exit mobile version