Sunny Leone | సన్నీలియోన్ ఏడ్చేేసింది.. వరదలో కొట్టుకపోయిన మూడు కార్లు

Sunny Leone | విధాత: పోర్న్ స్టార్‌.. సినీ నటి సన్నీ లియోన్ ఏడ్చేసింది… ఎందుకంటే ముంబై వరదల్లో ఆమెకు చెందిన ఖరీదైన మూడు కార్లు కొట్టుపోయి నష్టపోయిందంట.. అది తలుచుకుని ఏడ్చేసిందని స్వయంగా సన్నీలియోన్ చెప్పింది. తాజాగా సన్నీ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు తాను ప్రస్తుతం ముంబైలో ఉంటున్నానని, పనికోసం ముంబైకి వచ్చినప్పుడు నేను ఉండే ఇంటి గోడలు నీళ్లు కారేవని, అధిక తేమతో వస్తువులు తడిగా ఉన్నట్లుగా మారేవని, ఇంటి పరిస్థితిని చూసి ఆందోళన […]

  • Publish Date - August 10, 2023 / 12:09 PM IST

Sunny Leone |

విధాత: పోర్న్ స్టార్‌.. సినీ నటి సన్నీ లియోన్ ఏడ్చేసింది… ఎందుకంటే ముంబై వరదల్లో ఆమెకు చెందిన ఖరీదైన మూడు కార్లు కొట్టుపోయి నష్టపోయిందంట.. అది తలుచుకుని ఏడ్చేసిందని స్వయంగా సన్నీలియోన్ చెప్పింది.

తాజాగా సన్నీ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు తాను ప్రస్తుతం ముంబైలో ఉంటున్నానని, పనికోసం ముంబైకి వచ్చినప్పుడు నేను ఉండే ఇంటి గోడలు నీళ్లు కారేవని, అధిక తేమతో వస్తువులు తడిగా ఉన్నట్లుగా మారేవని, ఇంటి పరిస్థితిని చూసి ఆందోళన చెందేదానినన్నారు.

అయితే వర్షం అంటే ఇష్టమని, ఆకాశం నుండి చినుకులు నేలకు పడుతుంటే ముచ్చటగా అనిపించేదని, వర్షపు నీళ్లు ఇంటిలోపలిదాకా వస్తే మాత్రం నచ్చేది కాదన్నారు. ఒకసారి తీవ్ర వర్షాలలో నా మూడు కార్లు వరదలో కొట్టుకపోయాని, అందులో రెండు ఒకే రోజు వరదలో మాయమయ్యాయని, మేఘాలు అంత వర్షాన్ని దాచుకున్నాయా అనిపించిందని, ఇష్టపడి కొనుక్కున్న కార్లు వరదలలో కొట్టుకపోవడంతో ఏడ్చేశానన్నారు.

ఒక కారైతే ఎనిమిది మంది కూర్చునే మెర్సిడిస్ ట్రక్ అని, ఇండియాలో దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లు కొనాలంటే ఎక్కువ టాక్స్ కట్టాలన్నారు. ఇప్పుడు మాత్రం తాను ఇండియాలో తయారైన కార్లనే వాడుతున్నానని, అవి తనకు ఎంతగానో నచ్చాయని సన్నీ చెప్పుకొచ్చింది.