Site icon vidhaatha

Sharad Pawar | శ‌ర‌ద్ ప‌వార్‌ను చంపేస్తామని బెదిరింపులు..

Sharad Pawar | నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌( Sharad Pawar )ను చంపేస్తామ‌ని బెదిరింపు మేసేజ్ వ‌చ్చిన‌ట్లు ఆయ‌న కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే( Supriya Sule ) మీడియాకు తెలిపారు. త‌న తండ్రిని బెదిరింపుల‌కు గురి చేస్తూ త‌న వాట్సాప్‌కు మేసేజ్ వ‌చ్చింద‌ని ఆమె పేర్కొన్నారు. ఈ బెదిరింపుల‌పై ముంబై పోలీసు చీఫ్ వివేక్ ఫ‌న్స‌ల్‌ఖ‌ర్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా సుప్రియా సూలే మీడియాతో మాట్లాడుతూ.. ఓ వెబ్‌సైట్ ద్వారా తన వాట్సాప్‌కు మేసేజ్ వ‌చ్చింది. త‌న తండ్రి శ‌ర‌ద్ ప‌వార్‌ను చంపేస్తామ‌ని బెదిరించారు. దీంతో ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపు నేప‌థ్యంలో శ‌ర‌ద్ ప‌వార్ భ‌ద్ర‌త విష‌యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మ‌హారాష్ట్ర హోం శాఖ మంత్రి క‌ల్పించుకోవాల‌ని ఆమె కోరారు.

ఇలాంటి నీచ రాజ‌కీయాలు ఆపాల‌ని బెదిరింపు మేసేజ్ పంపిన అగంతకుల‌ను ఆమె హెచ్చ‌రించారు. ఇక బెదిరింపు వ‌చ్చిన మేసేజ్‌లను పోలీసుల‌కు స‌మ‌ర్పించారు సుప్రియా సూలే. బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె పోలీసుల‌ను కోరారు.

అయితే శ‌ర‌ద్ ప‌వార్‌కు కూడా న‌రేంద్ర ద‌భోల్క‌ర్ గ‌తే ప‌డుతుంద‌ని బెదిరింపు మేసేజ్‌లో హెచ్చ‌రించిన‌ట్లు ఎన్‌సీపీ నాయ‌కులు తెలిపారు. మూఢ‌న‌మ్మ‌కాల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన న‌రేంద్ర ధ‌బోల్క‌ర్ 2013, ఆగ‌స్టు 20న దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. పుణెలో మార్నింగ్ వాక్ చేస్తుండ‌గా న‌రేంద్ర‌ను చంపారు.

సుప్రియా సూలే ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని ఓ పోలీసు ఉన్న‌తాధికారి తెలిపారు. ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని పేర్కొన్నారు. సైబ‌ర్ క్రైమ్ పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నార‌ని తెలిపారు.

Exit mobile version