Site icon vidhaatha

Taraka Ratna: సీక్రెట్ లాకర్‌లో ఏముంది.. ఎందుకు పెద్దపాప భోరున ఏడ్చేసింది?

విధాత‌, సినిమా: తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో తారకరత్న(Taraka Ratna) ఇటీవ‌ల మృతి చెందిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు లోను కావడం, ఆ తరువాత గుండెపోటు వచ్చిందని డాక్టర్లు గుర్తించడం.. అలా 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తర్వాత ఆయన శివరాత్రి రోజు శివైక్యం చెందాడు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.

నందమూరి తారకరత్న తల్లితండ్రులకు ఇష్టం లేకుండానే వివాహం చేసుకున్నాడు. దీంతో చనిపోయేంతవరకు వాళ్లతో సత్సంబంధాలు లేకుండానే ఉన్నాయి. ఇప్పుడు తారకరత్న మరణం తర్వాత అలేఖ్య రెడ్డి (Alekhya Reddy) కి అత్తింటి వారి నుంచి మాత్రం సపోర్టు లేకుండా పోయిందని అంటున్నారు.

దీంతో ఆమె ఒక రకంగా ఒంటరిగానే మిగిలారని చెప్పొచ్చు. తారకరత్న అలేఖ్య రెడ్డి దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు జన్మించారు. ఇందులో పెద్దమ్మాయి నిష్కా. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత వీళ్లకు కవలలు జన్మించారు. వాళ్లకి తనయ్ రామ్‌, రేయా అని పేరు పెట్టారు.

మొత్తంగా తన పిల్లలకు ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా తారకరత్న నామకరణాలు చేశాడు. ఇక తండ్రి మరణంతో పిల్లలు మనోవేదనకు గురవుతున్నారు. నందమూరి తారకరత్న మరణం తర్వాత అతడి కెరీర్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరలవుతున్నాయి.

అతడు ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవించిన కష్టాలు, కెరీర్లో ఒడిదుడుకులు, ఫ్యామిలీలో గొడవలు, రాజకీయ ప్రయాణం.. ఇలా ఎన్నో రకాల సీక్రెట్లు బయటకు వస్తున్నాయి. దీంతో చనిపోయిన తర్వాత కూడా తారకరత్న పేరు నిత్యం వార్తలలోనే ఉంటుంది.

తారకరత్న మరణించి రెండు వారాలు అయింది. ఇటీవలే అతని పెద్దకర్మను కూడా నిర్వహించారు. దీంతో ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు అభిమానులు ఈ విషాదం నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తారకరత్నకు చెందిన ఓ సీక్రెట్ న్యూస్ ఫిలింనగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అటు సోషల్ మీడియాలో ఇటు సినీ వర్గాల్లో వైర‌ల్ అవుతున్న సమాచారం ప్రకారం.. తాజాగా శంకరపల్లిలో ఉన్న సొంత నివాసంలో తారకరత్నకు ఓ సీక్రెట్ లాకర్ ఉన్నట్లు తెలిసింది.

దీనిని అతని భార్య అలేఖ్య రెడ్డి తాజాగా ఓపెన్ చేసి చూశారని సమాచారం. అందులో కొన్ని విలువైన పత్రాలతో పాటు పెద్ద కూతురు నిష్కా వస్తువులను తారకరత్న దాచాడట. తమ ప్రేమకు ప్రతిరూపమని చెప్పుకుంటూ పెద్ద కూతురు నిష్కను తారకరత్న ఎంతగానో ప్రేమగా చూసుకునేవాడట. అందుకే ఆమె చిన్నప్పుడు వాడిన మొదటి వస్తువులను ఆ లాక‌ర్‌లో దాచుకున్నాడని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ వస్తువులను చూసిన నిష్కా.. మరింత ఎమోషనల్ అయిందని టాక్ వినిపిస్తోంది.

Exit mobile version