Tata Electric Cars | భారత్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ బంపర్ ఆఫర్స్‌ను ప్రకటించింది. మరో పది రోజుల్లో కొత్త సంబరం రాబోతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్‌ను తీసుకువచ్చింది. ఈ నెల 31లోగా కార్లను బుక్ చేసుకున్న వారికి రూ.2.6లక్షల వరకు డిస్కౌంట్ ప్రయోజనాలను అందించనున్నట్లు ప్రకటించింది. నెక్సాన్, టియాగో, టిగోర్ తదితర మోడల్స్‌పై టాటా మోటార్స్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఆయా కార్లపై డిసెంబర్ 31 వరకు లేదంటే.. స్టాక్స్ ముగిసే వరకు డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది.
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది. ప్రస్తుతం భారత్ అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ కార్లలో టాటా నెక్సాన్ ఈవీ మొదటి స్థానంలో ఉంది. అయితే, ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లోకి రాకముందు మార్కెట్‌లో ఉన్న నెక్సాన్ ఈవీ మోడల్స్‌పై కంపెనీ భారీగా డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఫేస్ లిఫ్ట్ వెర్షన్ కన్నా ముందు మార్కెట్‌కు పరిచయం చేసిన టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, నెక్సాన్ ఈవీ మాక్స్ వేరియంట్లపై కంపెనీ రూ.2.6 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్నది.
ప్రైమ్ వేరియంట్‌పై రూ.1.5 లక్షల క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ. 50వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తున్నది. టాటా నెక్సాన్ మ్యాక్స్ వేరియంట్‌పై రూ.2.1 లక్షల డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనన్‌ను ఆఫర్ చేస్తున్నది. మొత్తంగా మ్యాక్స్ వేరియంట్‌పై రూ.2.6 లక్షలు, ప్రైమ్ వేరియంట్‌పై రూ.1.9 లక్షల డిస్కౌంట్ వర్తించనున్నది. ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్స్ లో నెక్సాన్ ప్రైమ్ రూ.14.5 లక్షల నుంచి రూ. 17.19 లక్షల శ్రేణిలో, నెక్సాన్ మ్యాక్స్ రూ.16.49 లక్షల నుంచి రూ.19.54 లక్షల శ్రేణిలో లభిస్తుండడం విశేషం.
ఇక టాటా టిగోర్ ఈవీ ప్రస్తుత ఎక్స్ షో రూం ధర వేరియంట్‌ను బట్టి రూ.12.40 లక్షల నుంచి రూ.13.75 లక్షల మధ్య ఉన్నది. ఈ మోడల్‌పై ఇయర్ ఎండ్ ఆఫర్‌లో రూ.1.1లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. రూ.50వేలు క్యాష్ డిస్కౌంట్ కాగా.. రూ.50 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10 వేలు కార్పొరేట్ బెనిఫిట్ వర్తించనున్నాయి. టాటా టియాగో ఈవీ ప్రస్తుత ఎక్స్ షో రూం ధర వేరియంట్‌ను బట్టి రూ.8.69 లక్షల నుంచి రూ. 12.04 లక్షల మధ్య ఉంది. ఈయర్ ఎండ్ ఆఫర్‌లో రూ.77వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ.55 వేలు గ్రీన్ బోనస్, రూ.15 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.7వేల వరకు కార్పొరేట్ బెనిఫిట్స్‌ను టాటా మోటార్స్ అందిస్తున్నది.