- కోడ్ కూయకముందే కీలక నిర్ణయాలు
విధాత, హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మండలి సమావేశం ఈ నెల 11న నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ఏ రోజైనా వెలువడే అవకాశముండటంతో ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే కీలకమైన విధాన పర నిర్ణయాలు తీసుకునేందుకు 11న మంత్రి మండలి భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసిన ప్రభుత్వం మహిళలకు 2,500ఆర్ధిక సహాయం పై మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అలాగే 11న భద్రాచలంలో ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు కోసం హడ్కో నుంచి తీసుకోనున్న 3వేల రుణాలకు మంత్రిమండలిలో ఆమోదం పొందనున్నారు. అలాగే పలు ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయాలతో పాటు, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కొత్తగా చేపట్టనున్న అభివృద్ధి పథకాలపై మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది.