హైదరాబాద్ : ఈ నెల 17వ తేదీన జరగాల్సిన జెన్‌కో రాత పరీక్షలు వాయిదా వేస్తూ జెన్‌కో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు ఇతర పరీక్షలు ఉండటం కారణంగా జెన్‌కో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ జెన్‌కో వెల్లడించింది.
తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 5వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు.
నవంబరు 14, 15 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.