ఉత్త‌మ వైద్య సేవ‌ల్లో తెలంగాణ మూడో స్థానం : మంత్రి హ‌రీశ్‌రావు

Minister Harish Rao | రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వైద్య ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేశారు. ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది. ఏడాదిలో 8 వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. మరో 9 కొత్త వైద్య శాఖలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ నలుమూలల 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. కొత్తగా 61 డయాలసిస్‌ కేంద్రాలు మంజూరు చేశాం. ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ […]

  • Publish Date - January 29, 2023 / 12:30 PM IST

Minister Harish Rao | రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వైద్య ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేశారు. ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది. ఏడాదిలో 8 వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. మరో 9 కొత్త వైద్య శాఖలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ నలుమూలల 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. కొత్తగా 61 డయాలసిస్‌ కేంద్రాలు మంజూరు చేశాం. ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయోగ్నోస్టిక్‌ హబ్స్‌ ఉన్నాయని, త్వరలో మరో 13 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెస్తామన్నారు.

వైద్యారోగ్య శాఖ మంత్రిగా హ‌రీశ్‌రావు ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా.. ఈ సంవ‌త్స‌ర కాలంలో ఆ శాఖ‌లో జ‌రిగిన అభివృద్ది నివేదిక‌ను మంత్రి హ‌రీశ్‌రావు విడుద‌ల చేశారు. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగానికి సీఎం కేసీఆర్ అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించామ‌న్నారు. రోగుల తాకిడి కూడా ఎక్కువైంద‌న్నారు. 2021లో 4 కోట్ల 21 లక్షల మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు పొందారని తెలిపారు. 2022లో 4 కోట్ల 60 లక్షల మందికిపైగా ఓపీ సేవలు వినియోగించుకున్నారని గుర్తు చేశారు.. ఇన్‌పేషెంట్ల సంఖ్య కూడా 30 లక్షలకు పైగా పెరిగిందని అన్నారు. 2022లో బస్తీ దవాఖానాల్లో 47 లక్షల మంది ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారని చెప్పారు. ఎన్‌సీడీసీ స్క్రీనింగ్‌ ద్వారా ఇంటి వద్దకు వెళ్లి పరీక్షలు చేస్తున్నామని మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

మాతా, శిశు మ‌ర‌ణాల రేటు అతి త‌క్కువ‌గా ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ అని మంత్రి గుర్తు చేశారు. 2014 నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 కాగా.. ప్రస్తుతానికి 21కి తగ్గిందని వెల్లడించారు. కేసీఆర్ కిట్ అమ‌లు చేయ‌డంతో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప్ర‌స‌వాల సంఖ్య 61 శాతం పెరిగింద‌ని గుర్తు చేశారు. సాధార‌ణ ప్ర‌స‌వాల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో టిఫా స్కానింగ్ యంత్రాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు.

Latest News