Site icon vidhaatha

MLC Shambipur | మల్కాజిగిరి టికెట్ రేసులో ఎమ్మెల్సీ శంభీపూర్

MLC Shambipur |విధాత: మల్కాజిగిరి సిటింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి టి.హరీశ్‌రావుపై చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపధ్యంలో ఆయనపై బీఆరెస్‌ అధిష్టానం వేటు వేసి, తొలి జాబితాలో ప్రకటించిన పార్టీ టికెట్‌ను రద్ధు చేసేందుకు సిద్దమైన నేపధ్యంలో ఆయన స్థానంలో ఎమ్మెల్సీ, మేడ్చల్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్‌ రాజు టికెట్‌ రేసులోకి వచ్చారు.

శంభీపూర్‌ రాజు సోమవారం మంత్రి టి.హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. తాను టికెట్‌ ఇస్తే పార్టీ తరుపునా మల్కాజిగిరి బరిలోకి నిలిచేందుకు సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇదే స్థానాన్ని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి సైతం ఆశిస్తున్నారు.

Exit mobile version