Telangana Debt | ఈ ఏడాదికి తెలంగాణ ప్రభుత్వ అప్పు ఎంతంటే?

విధాత‌: ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడి తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 650 కోట్ల అప్పు తీసుకునే అవకాశం మాత్రమే ఉన్నది. ఇప్పటికే రూ.36 వేల కోట్లు రుణాల ద్వారా సేకరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో వెయ్యి కోట్లు తీసుకున్నది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అప్పు రూ.37 వేల కోట్లకు చేరింది. ఈ మేరకు రూ. 500 కోట్ల చొప్పున 11-13 ఏళ్ల కాలానికి ఆర్థికశాఖ జారీ చేసిన బాండ్లను […]

  • Publish Date - March 7, 2023 / 07:44 AM IST

విధాత‌: ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడి తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 650 కోట్ల అప్పు తీసుకునే అవకాశం మాత్రమే ఉన్నది. ఇప్పటికే రూ.36 వేల కోట్లు రుణాల ద్వారా సేకరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో వెయ్యి కోట్లు తీసుకున్నది.

దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అప్పు రూ.37 వేల కోట్లకు చేరింది. ఈ మేరకు రూ. 500 కోట్ల చొప్పున 11-13 ఏళ్ల కాలానికి ఆర్థికశాఖ జారీ చేసిన బాండ్లను రిజర్వుబ్యాంకు వేలం వేసింది. కేంద్రం అనుమతించిన రుణంలో మరో రూ. 650 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నది.

తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది తీసుకునే కొత్త రుణాలతో కలిపి మొత్తం అప్పులు రూ. 4,86,302.21 కోట్లకు చేరుతాయని ఇటీవల ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో వెల్లడించింది.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడి నేరుగా తీసుకున్న రుణాలను బడ్జెట్‌లో చూపెడుతుంది. ఇవి (2022-23)లో రూ.3,22,993 కోట్లు కాగా, 2023-24లో రూ. 35 వేల కోట్లు అదనంగా పెరిగి రూ.3, 57,059 కోట్లకు చేరుకున్నాయి.

ఇవే కాకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులకు పూచీకత్తు ఇచ్చినవి బడ్జెట్‌ వెలుపల అదనంగా ఉంటాయి. వాటితో కలిపితే మొత్తం రూ. 4.86 కోట్లకు చేరుతాయి. వచ్చే ఏడాది లో రాష్ట్ర జనాభా 4 కోట్లు ఉంటుందని అంచనా. దీని ఆధారంగా లెక్కిస్తే.. ఒక్కొక్కరిపై తలసరి రుణభారం రూ. 1,21,575 కోట్లు ఉంటుందని అనధికార అంచనా.

Latest News