Television Price Hike | టీవీ కొనాలనుకుంటున్నారా..? ఇప్పుడే తీసుకోండి.!

చాలాకాలం ఎవరైనా ఇంట్లోకి కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? ధరలు తగ్గుతాయేమోనని అనుకుంటున్నారా..? టీవీ కొనుగోలు చేయాలని భావిస్తే ఇదే సరైన సమయం

  • Publish Date - January 30, 2024 / 05:45 AM IST
  • త్వరలో భారీగా పెరగనున్న ధరలు..!

Television Price Hike | చాలాకాలం ఎవరైనా ఇంట్లోకి కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? ధరలు తగ్గుతాయేమోనని అనుకుంటున్నారా..? టీవీ కొనుగోలు చేయాలని భావిస్తే ఇదే సరైన సమయం. ఎందుకంటే ధరలు తగ్గుడు దేవుడెరుగు.. త్వరలో ధరలు భారీగా పెరగనున్నాయి. టీవీల్లో కీలకమైన కాంపోటెన్స్‌లో ఒకటైన ‘ఓపెన్‌ సెల్స్‌’ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో టీవీల ధరలు ఆకాశాన్నంటే అవకాశాలున్నాయి. కరోనా మహమ్మారి నుంచి ఈ ఓపెన్‌ సెల్స్‌ ధరలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


గత డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు ఓపెన్‌ సెల్‌ ధరలు ఏకంగా 20శాతం వరకు పెరగడంతో పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. చైనీస్‌ న్యూ ఇయర్‌.. ఫిబ్రవరి చివరి నాటికి కాంపోనెంట్స్‌ ధరలు మరో 15శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని టీవీ ప్యానెల్స్‌ మాన్యుఫ్యాక్చర్సింగ్‌ కంపెనీల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీవీల తయారీలో ఈ ఓపెన్‌ సెల్‌ ప్రధాన భాగం. టీవీ ప్రొడక్షన్‌ కాస్ట్‌లో దీని ధరే 60-65 శాతం మధ్య ఉంటుంది. వీటిని చైనాలో కేవలం నాలుగైదు కంపెనీలు మాత్రమే తయారు చేస్తున్నాయి.


ఇది కూడా పెద్ద సమస్యగా మారింది. ఆయా కంపెనీల చేతుల్లోనే ధరలను నిర్ణయించే అధికారం ఉండడంతో ఆడిందే ఆటగా మారింది. రాబోయే రోజుల్లో చిన్న, పెద్ద టీవీ ప్యానళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందరి ఓ రిటైలర్‌ వెల్లడించారు. కంపెనీలు తమపై పడుతున్న భారాన్ని బేరీసు వేసుకొని టీవీల ధరలను పెంచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఓపెన్‌ సెల్‌ ధరలు నెలానెలా పెరుగుతున్నాయని, ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించడంతో ఫలితంగా డిమాండ్‌ పెరిగి ధరలు పెరుగుతున్నాయని కొడాక్‌ బ్రాండ్‌ లైసెన్సీ సూపర్‌ ప్లాస్ట్రోనిక్స్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవ్నీత్ సింగ్ మార్వా పేర్కొన్నారు.


అన్ని రకాల టీవీల ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని. ఫిబ్రవరి, మార్చ్​లో కనీసం 10శాతం పెరుగుదల ఉండవచ్చని మార్వా పేర్కొన్నారు. టెలివిజన్ ప్యానెల్స్​కి చెందిన మరొక కాంట్రాక్ట్ తయారీదారు వీడియోటెక్స్ ధరలను 5-10 శాతం పెంచాలని ఆలోచిస్తున్నది. ఈ విషయంపై సంస్థ డైరెక్టర్ అర్జున్ బజాజ్ మాట్లాడుతూ.. ఓపెన్‌ సెల్‌ ధరలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుందని, కొవిడ్‌ తర్వాత నుంచి ఈ పరిస్థితి పరిశ్రమను ఇబ్బందులు పెడుతుందని చెప్పారు. ఓపెన్ సెల్ తయారీదారులు ఉత్పత్తిని తగ్గించడంతోనే ఇటీవల ధరలు పెరిగాయని, ఇంకా పెరుగుతున్నాయన్నారు. ఈ ధరల పెరుగుదల ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదన్నారు.