ORR | ఔట‌ర్ రింగ్ రోడ్డుపై వేగ ప‌రిమితి పెంపు.. ఇక‌పై 120 కి.మీ. వేగంతో దూసుకెళ్లొచ్చు..

ORR | మీరు హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డుపై నిత్యం ప్ర‌యాణిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇప్ప‌టి వ‌ర‌కు 100 కిలోమీట‌ర్ల వేగాన్ని 120 కిలోమీట‌ర్ల‌కు పెంచారు. గంట‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ప్ర‌యాణించొచ్చ‌ని రాష్ట్ర అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఇవాళ రాష్ట్ర ఐటీ, ప‌ట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌తో చ‌ర్చించిన త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. వేగ […]

  • Publish Date - June 27, 2023 / 12:57 PM IST

ORR | మీరు హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డుపై నిత్యం ప్ర‌యాణిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇప్ప‌టి వ‌ర‌కు 100 కిలోమీట‌ర్ల వేగాన్ని 120 కిలోమీట‌ర్ల‌కు పెంచారు. గంట‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ప్ర‌యాణించొచ్చ‌ని రాష్ట్ర అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

ఇవాళ రాష్ట్ర ఐటీ, ప‌ట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌తో చ‌ర్చించిన త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. వేగ ప‌రిమితిని పెంచ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని భ‌ద్ర‌తా ప్రోటోకాల్స్‌ల‌ను ఉంచాల‌ని హెచ్ఎండీఏ అధికారుల‌ను ఆదేశించారు.

అయితే ఓఆర్ఆర్‌పై పెరుగుతున్న ప్ర‌మాదాల దృష్ట్యా, గ‌తంలో సైబ‌రాబాద్ పోలీసులు వేగ‌ప‌రిమితిని 120 నుంచి 100 కిలోమీట‌ర్ల‌కు త‌గ్గించిన విష‌యం తెలిసిందే. రెండు లేన్‌ల‌(మొద‌టి, రెండు) వేగం క‌నిష్టంగా 80 కి.మీ., గ‌రిష్టంగా 100 కిలోమీట‌ర్లు ఉండాల‌ని, మూడు, నాలుగో లేన్‌ల‌లో 40 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్లాల‌ని గ‌తంలో నోటిఫై చేశారు. తాజాగా నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించి వేగ‌ప‌రిమితిని 120 కిలోమీట‌ర్ల‌కు పెంచారు.

Latest News