విధాత, హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాగి రోడ్లపై వాహనాలు నడపద్దంటూ హైదరాబాద్ పోలీసులు ఎంత మొత్తుకున్నా…కొందరు తాము అనుకున్నదే చేసి రోడ్లపై హల్చల్ చేశారు. అయితే నిబంధనలు ఉల్లంఘించి తాగి వాహనాలతో రోడ్లుపైకి వచ్చిన మందుబాబుల్లో వేలాది మంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు.
బుధవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో 2.731 మంది మందుబాబులు పట్టుబడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928 మంది, మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 605 మంది పట్టుబడ్డారు. వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చట్టప్రకారం వారిపై తదుపరి చర్యలు తీసుకుంటారు.
ఇవి కూడా చదవండి :
Telangana student dies| జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి
Tobacco Products GST hike| న్యూఇయర్ లో సిగరేట్, పాన్ మసాల ప్రియులకు కేంద్రం షాక్
