Vanama Venkateswara Rao
విధాత: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎమ్మెల్యే పదవి అనర్హత వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.
ప్రాథమిక విచారణ అనంతరం ఆయనపై అనర్హత వేటు వేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. దీంతో అత్యున్నత ధర్మాసనం స్టే ఆదేశాలు వనామా ఎమ్మెల్యే పదవి కోల్పోకుండా తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లయ్యింది.